ఊపందుకున్న బాక్సైట్ తవ్వకాల వ్యతిరేక ఉద్యమం
Writen by vaartha visheshalu 6 months ago - 0 Comments
విశాఖ జిల్లా చింతపల్లి జనసందోహమైంది. ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా చింతపల్లిలో వైఎస్సార్సీపీ నిర్వహించిన బహిరంగసభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో ఆయన సభాస్థలి వద్దకు చేరుకున్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వేదిక వద్దకు వైఎస్ జగన్ ప్రజాభిమానులకు తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వేలాదిమంది ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి.. ఏ ఒక్కరి మొహంలో కూడా ఆకష్టాన్ని చూపించకుండా...కష్టం అనిపించినా, దూరం నుంచి వచ్చామన్న తలంపును సైతం పక్కనపెట్టారని వైఎస్ జగన్ అన్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా, భోజనానికి వెళ్లాలన్న ఆలోచనను కూడా పక్కన పెట్టి, చక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయతను పంచిపెడుతున్న ....ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు చేతులు జోడించి, శిరస్సు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానంటూ వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. లక్షల గొంతులు తమకు బాక్సైట్ తవ్వకాలు వద్దంటున్నా.. చంద్రబాబుకు మాత్రం జ్ఞానోదయం కావడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం చెబితే ఒకసారి కాస్త వెనక్కి తగ్గిన బాబు… ఆ తర్వాత మళ్లీ గ్రామసభలు జరిగాయంటూ అబద్ధాలు చెప్పి బాక్సైట్ తవ్వకాల విషయంలో ముందుకెళ్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు బాక్సైట్ తవ్వకాలు జరగనివ్వబోమని …ఇక్కడ గ్రామసభలు కూడా జరగలేదని, గ్రామసభలు ఒప్పుకోలేదని 2011లో గవర్నర్‌కు బాబు లేఖ రాశారు. ఇదే చంద్రబాబు సీఎం అయ్యాక మొన్న ఒక శ్వేతపత్రం విడుదల చేసి, అందులో మాట మార్చేశారు. గ్రామసభలు జరిగాయని, అవి బాక్సైట్ మైనింగ్ కావాలంటూ తీర్మానించాయని అన్నారు. గ్రామాలేవీ అంగీకరించకపోయినా చంద్రబాబు అబద్ధాలు చెబుతూ ముందుకెళ్తున్నారంటూ ఆరోపించారు జగన్. నిజంగా ప్రజల మంచిని కోరుకునే వాడివైతే వెంటనే బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని లేదంటే …ప్రజల తరుపును పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు జగన్.
No comments:
Post a Comment