మోస్ట్ ‘ఎర్ర’ స్మగ్లర్ మూస దొరికాడు | |
రూ.10వేల కోట్లకుపైగా ఆస్తులు
చెన్నై సమీపంలో నెల్లూరు అటవీ, పోలీసుల సంయుక్త దాడులు 4 జిల్లాల్లో విస్తరించిన రవాణా సామ్రాజ్యం
నెల్లూరు, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి):ఎర్రచందనం దుంగల రవాణాలో అంతర్జాతీయ స్మగ్లర్ మూసను సోమవారం తమిళనాడులో నెల్లూరు అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై పదికిపైగా కేసులు ఉన్నాయి. ఆయన పూర్తి పేరు మలియక్కల్ మూస(60). గతంలో పలుమార్లు మూసను అరెస్టు చేసేందుకు ఫారెస్ట్ సిబ్బంది ప్రయత్నించినా చాకచక్యంగా తప్పించుకునేవాడు. మరోవైపు తమిళనాడుకు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు, ప్ర ముఖుల అండదండలు ఉండటం తో మూస ఉండే ప్రాంతంలో నెల్లూరు అటవీ శాఖ అఽధికారులు, పోలీసులు కాలుమోపలేని పరిస్థితి. కాగా, ఇటీవల అడవుల్లోని ఎర్రచందనం వృక్షాలు పరిరక్షణ, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా నెల్లూరు డీఎఫ్‌వో రాంబాబు, సివిల్ పోలీసుల సహకారంతో చెన్నై సమీపంలోని తిట్టేటి వద్ద ఓ ఇంటిలో స్మగ్లర్ మూస ఉండగా ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈయనపై పలు వారెంట్ కేసులు ఉన్నాయి. రూ.10 వేల కోట్ల ఆస్తిపరుడైన మూసకు తమిళనాడు పోలీసులతోపాటు రాజకీయనేతల అండదండలున్నాయి. మూస నేరసామ్రాజ్యం నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు విస్తరించింది. స్మగ్లర్ మూసను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుసుకున్న పలువురు తమిళనాడు న్యాయవాదులు సోమవారం నెల్లూరుకు చేరిపోయారు. మూసను విచారించాకే అరెస్ట్ చూపిస్తామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
|
Tuesday, 23 September 2014
మోస్ట్ ‘ఎర్ర’ స్మగ్లర్ మూస దొరికాడు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment