Friday, 19 September 2014

Arthur Cotton - Cinema


ఆర్ధర్ కాటన్ సినిమా 

కెప్టేన్ ఆర్దర్ కాటన్ ఆనకట్ట ప్రతిపాదనల్ని బ్రిటీష్ పార్లమెంటు రెండుసార్లు తిరస్కరించింది. మూడోసారి ఇచ్చిన వివరణకు మాత్రమే సానుకూలంగా స్పందించింది. అది కుడా వ్యక్తిగత పూచీకత్తు మీద. వాగ్దానం చేసిన రెవెన్యూను సాధించడానికి కాటన్ చాలా కష్టపడ్డాడు. కాటన్ జీవితం మీద నేను చెప్పిన లైనులో అంటే ఫోక్ ఎలిమెంటుతో ఒక గొప్ప సినిమా తీయవచ్చు.



సాంబశివ రావు కాకానీ _  ఆర్ధర్ కాటన్ గోదావరి ఆనకట్ట కట్టిన తరువాత గ్రేట్ బ్రిటన్ లో అతని మీద అవినీతి ఆరోపణలతో విచారణ కూ జరిపారు.


అవతార్ హీరో కు రామాయణంలో విభీషణుడు, భారతంలో వికర్ణుడు పాత్రల్లో అలాంటి మూలాలు వుంటాయి. ఒక విధంగా సర్ ఆర్దర్ కాటన్ పాత్ర కూడా అలాంటిదే. ఆయన మిలటరీ కెప్టెన్ గా రాజమండ్రి వచ్చి, దైవభక్తి మూలంగా ఆనకట్ట కట్టాడు.


వికర్ణుడు స్వయంగా దుర్యోధనును సోదరుడు. కొంతమంది ఊహించినట్టు కర్ణుని కుమారుడుకాదు.


Danny Notes
19 September 2014
కాటన్ – ఆధిపత్య కులాల పుట్టుక
ధవిళేశ్వరం ఆనకట్ట కట్టడానికి బ్రిటీష్ పార్లమెంటును ఒప్పించడం ఒక సమస్య అయితే స్థానిక ప్రజల్ని ఒప్పించడం అంతకన్నా పెద్ద సమస్య అయింది. అప్పటికి కొన్ని అగ్రహారాలుతప్ప, కొన్ని ప్రత్యేక ప్రాంతాలుతప్ప, ప్రైవేటు భూమి అనేది లేదు కనుక, భూసేకరణ సమస్యలేదుగానీ, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడానికి ప్రజల్ని సంసిధ్ధుల్ని చేయడానికి కష్టపడాల్సి వచ్చింది.
అప్పటి వరకు ఉచిత వర్షాధార సాగుకు అలవాటుపడిన రైతులు నీటి శిస్తు కట్టడానికి వ్యతిరేకించారు. చెరువు వ్యవసాయం వున్నవాళ్ళు చెరువులు ముంపుకు గురవుతాయని భయపడ్డారు. అప్పటి వరకు శూద్రులుగా వుండి వ్యవసాయరంగంలో వస్తున్న సవాళ్లను స్వీకరించడానికి సిధ్ధపడ్ద సామాజికవర్గాలు కాటన్ కు తోడుగా నిలిచాయి. అవే తరువాతి కాలంలో ఆధిపత్యకులాలు కాగలిగాయి.


Goutham Kondapavuluri garu ! Andhra people particularly in the regions of Godavari and Krishna deltas are Progeny of Arthur Cotton. You call them offspring of canal irrigation.








No comments:

Post a Comment