ఒక ప్రేమకథ 
ప్రేమ ప్రేమను
ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది.
ప్రేమ ప్రేమను
ప్రేమగా ప్రేమిస్తుంది
ప్రేమను
ప్రేమించిన ప్రేమ ప్రేమచే ప్రేమింపబడిన ప్రేమను 
ప్రేమిస్తుంది.  
-        
శ్రీశ్రీ
ఖడ్గసృష్ఠి
యవ్వనంలో ప్రవేశించే నాటికే తన జీవిత భాగస్వామి ఎలా
వుండాలనే విషయం మనిషి మెదడులో నిర్ణయం అయిపోతుంది. అలాంటి భాగస్వామి కోసం మనుషులు నిరంతరం
అన్వేషిస్తూ  వుంటారు. అది ప్రేమ ఆపరేటింగ్
సిస్టమ్. ఆ ప్లాట్ ఫామ్ మీద ప్రేమ వర్ధిల్లుతూ వుంటుంది.  ఈ ఓయస్ ఆధారంగా కోటాను కోట్లమంది ప్రేమలో
పడుతుంటారు. 
అయితే, ప్రపంచంలో ప్రేమ ఒక్కటే వుండదు. ప్రేమను దెబ్బతీసే
విషయాలు చాలా చాలా వుంటాయి. అవి ప్రేమికుల్ని విడదీస్తాయి. అలా ఒక ప్రేమజంట మధ్య
విబేధాలొచ్చాయి.  అమ్మాయికి అబ్బాయి మీద
చాలా కోపం వచ్చింది. మెదడు డ్రైవ్ నుండి లవ్ ఎఫైర్ ఫైలును డిలీట్ చేసేసింది.  అబ్బాయికి కూడా చాలా పౌరుషం వచ్చింది. తను కూడా
బ్రైన్ డ్రైవ్ నుండి లవ్ ఎఫైర్ ఫైలును డిలీట్ చేసేశాడు.  
నిన్నటి వరకు ప్రేమికులుగా
వున్నవాళ్ళు హఠాత్తుగా అపరిచితులు అయిపోయారు. ఇద్దరూ కొత్తగా జీవిత భాగస్వాముల
అన్వేషణ మొదలెట్టారు. ఆపరేటింగ్ సిష్టం ప్రకారం అప్పుడయినా, ఇప్పుడయినా అతను
కోరుకునే అమ్మాయి ఆమెయే. ఆమె కోరుకునే అబ్బాయి కూడా అతనే. గతం గుర్తులేని
ఇద్దరూ  మళ్ళీ కొత్తగా ప్రేమలో పడ్డారు.
వాళ్ళు పెళ్ళిచేసుకుని ఇంటికి చేరడానికి ముందే అక్కడ ఆశ్చర్యకరంగా వాళ్ల ప్రేమ
ఆల్బం వుంది!!! 
ఈ కాన్సెప్ట్ ను 70-80 సీన్లలో కామెడీ / సెటైర్  ట్రాక్ లో చెప్పగలినవాళ్ళు నన్ను సంప్రదించగలరు.
 
No comments:
Post a Comment