|
విజయవాడ, జూన్ 16 : తెలంగాణ సీఎం కేసీఆర్పై జెరూసలెం మత్తయ్య ఇచ్చిన ఫిర్యాదును ఏపీ పోలీసులు సీఐడీకి అప్పగించారు. ఫిర్యాదులో అనేక కోణాలు ఉన్నందున దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఓటుకు నోటు కేసులో ఏ-4 నిందితుడైన మత్తయ్య కేసులో ఏపీ సీఎం చంద్రబాబు పేరు చెప్పాలని టీఏసీబీ అధికారులు బెదిరించారని మత్తయ్య ఫిర్యాదు చేశారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని మత్తయ్య ఆరోపించారు. దీనిపై విజయవాడలో కేసు నమోదు చేశారు.
|
No comments:
Post a Comment