Friday, 3 October 2014

To Rome With Love (2012 ) Concept & Screenplay



To Rome With Love (2012 )

Directed by                Woody Allen
Produced by             Letty Aronson
Stephen Tenenbaum
Giampaolo Letta
Faruk Alatan

Written by                  Woody Allen
Starring                      Woody Allen
Alec Baldwin
Roberto Benigni
Penélope Cruz
Judy Davis
Jesse Eisenberg
Greta Gerwig
Ellen Page

Cinematography      Darius Khondji
Edited by                   Alisa Lepselter
Production
company      
Medusa Film
Gravier Productions
Perdido Production



INDEX

1.    కథాంశం (ఏం చెప్పదలుచుకున్నాం?)               పేజీ   2 -3
2.    ప్రధాన పాత్రలు (ఎవరితో చెప్పిస్తున్నాం)            పేజీ   4 - 13
3.    కథ (ఎలా చెపుతున్నాం )                           పేజీ   14 - 20
4.    పాత్రలు నటులు (Characters & Cast)       పేజీ   21
5.  SCENES AT – A – GLANCE                 పేజీ   22 - 27
6.  సన్నివేశాల వరసక్రమం – సున్నిత అంశాలు      పేజీ   28 - 60
(Screen Play & Mood Of The Scene)
7.  Dialogue Version                                    పేజి 61 - 144
To Rome With Love (2012 )

కథాంశం 
(ఏం చెప్పదలుచుకున్నాం?)
Theme of story : The  Desire to be Appreciated
గుర్తింపు అనేది మనుషులకు అన్నింటికన్నా పెద్ద సమస్య.

నలుగురి ప్రశంసలు పొందాలని ప్రతి మనిషికీ అంతర్లీనంగా ఒక కోరిక వుంటుంది. గుర్తింపులేని జీవితాన్ని గడుపుతున్నవారిలో ఈ కోరిక మరింత బలంగా  వుంటుంది.

 ఎదో ఒకటి చేసి తమ ప్రత్యేకతల్ని చాటుకోవాలనే తపన ఒక చోదకశక్తిగామారి మనుషుల్ని అనేక ప్రయోగాలకు పురికొల్పుతుంది.  ఆ ప్రయోగాలు  సమాజాన్ని చలనశీలంగా మారుస్తాయి. నలుగురి ప్రశంసలు పొందాలనే  కోరికే లేకపోతే మనుషుల్లో జీవితం మీద ఆసక్తి అంతరించిపోతుంది. అది ఎప్పుడయినా సమాజానికి నష్టమే.

నలుగురి ప్రశంసలు పొందాలనే తపించే జీవులు  జెర్రీ, లియోపోల్డో. జెర్రీ ఒకప్పుడు ఒపేరా దర్శకుడు. ఇప్పుడు విశ్రాంతజీవి. ఎదో ఒకటి చేసి మళ్ళీ వెలుగులోనికి రావాలనేది అతని తపన.  లియోపోల్డో సామాన్య మధ్యతరగతి గుమాస్తా. తనచుట్టూ జనం వుండాలనీ, తను ఏదైనా మాట్లాడితే ఆసక్తిగా వినాలని తపించే అల్పజీవి. మిల్లీని వశపరచుకోవడానికి లూకా సాల్టా కూడా ఈ ఎత్తుగడనే ప్రయోగిస్తాడు. సాంస్కృతిక వ్యవహారాల్లో ఆమె అభిప్రాయాలన్ని తాను గౌరవిస్తానంటాడు. బహుశ అమె భర్త ఎప్పుడూ ఆమెను అలా ప్రశంసించి వుండడు. జెర్రీ అల్లుడు మికెల్యాంజిలో  ఏ విషయాన్నయినా సామ్యవాద చర్చగా మార్చి తన ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తుంటాడు. మెరుపుతీగ వంటి మోనిక తనకు దక్కితే బాగుండునని జాక్ అనుకుంటాడు. అబ్బాయిలకు  చమ్మక్ ఛల్లు లాంటి  అమ్మాయిలు క్యాట్ నిప్ లా కనిపిస్తారు. నిజానికి అలాంటి అమ్మాయిలను జీవిత భాగస్వామిగా చేసుకోవాలని అబ్బాయిలు అనుకోరు. కానీ అప్పటికి ఒక పందెం  గెలవాలని మాత్రం గట్టిగా అనుకుంటారు. ఇది యవ్వనంలో అహానికి సంబంధించిన అంశం.
తన చుట్టూ వున్న వారిని ఆకర్షించడానికి మోనిక నిరంతరం చాలా తంటాలు పడుతూవుంటుంది. తెలియని అంశాల్లోనూ తనకు పరిజ్ఞానం వున్నట్టు జంకుబొంకు లేకుండా మాట్లాడేస్తుంటుంది. ఇదామె గుర్తింపు సమస్య.

ప్రత్యేకతల్ని చాటుకోవడంకోసం, పేరు ప్రఖ్యాతుల్ని సాధించడం కోసం మనుషులు చేసే ప్రయత్నాల వెనుక పురుషులు స్త్రీలని, స్త్రీలు పురుషుల్ని ఆకర్షించాలనే అంశం అంతర్లీనంగా వుంటుంది. మనుషుల శరీరధర్మం సామాజిక చర్యలుగా కొనసాగుతుంటాయి.
ప్రేమలేని సంభోగం వున్నట్టే, సంభోగంలేని ప్రేమ కూడా వుంటుంది. ప్రేమ, సంభోగాల ఘర్షణ  అందరి జీవితాల్లోనూ అనేక స్థాయిల్లో వర్ధిల్లుతూ వుంటుంది.

రోమ్ నగరంలో భావుకత వుంటుంది, వుద్వేగం వుంటుంది. ఆటవిడుపుగా కొంచెం హాస్యం వుంటుంది. జీవితాల్లో మార్పు కోసం, గుర్తింపు కోసం  కొన్ని సాహసాలు చేయాలని రోమ్ లో ప్రతి జీవీ ఉవ్విళ్ళూరుతుంటుంది.   రోమ్ పురాతన నగరమేకాదు, వర్తమాన సజీవ స్రవంతి కూడా. అక్కడ దృశ్యం ఏదయినా నేపథ్యంలో శృంగార సంగీతం వినిపిస్తూ వుంటుంది. అసంఖ్యాక ప్రజలు రోమ్ నగర వీధుల్లో పొంగిపొర్లుతున్న ప్రేమను జుర్రుకుంటూ వుంటారు. అలాంటి అనేకానేక కథల్లో భాగమే ఈ  నాలుగు కథలు.  















To Rome With Love (2012 )
ప్రధాన పాత్రలు
(ఎవరితో చెప్పిస్తున్నాం)

1.  గ్లియాన్ కార్లో 
గియన్ కార్లో రోమ్ నగరంలో  శవపేటికల వ్యాపారి. పెద్దగా చదువుకోలేదు. పిల్లల్ల చదువుల కోసం రాత్రింబవళ్ళు  కష్టపడుతుంటాడు. అతని పూర్వికులు వెర్డీ కళాకారులు.  అతనిలో అంతర్లీనంగా గాత్ర సంగీతకారుడు వుంటాడు. అయితే, దాన్ని సాధన చేసే తీరిక, ఆర్ధిక సదుపాయం అతని జీవితంలోలేదు. పగలంతా కష్టపడి అలిసిపోయి, సాయంత్రం ఇంటికి చేరి, బాత్ రూం లో బట్టలూడదీసి  షవర్ కింద నిలబడ్డప్పుడు అతను సేదదీరుతున్నట్టు భావిస్తాడు. ఊపిరాడని శ్రమజీవి బతుకులో అవే అతనికి దక్కే ఆనంద ఘడియలు. అలాంటి సమయాల్లో అతను పాటలు పాడుతాడు. ఆ పాటల్ని కుటుంబ సభ్యులు బాత్ రూమ్ పాటలుగా భావిస్తారే తప్ప. అతనిలో గొప్ప వెర్డీ గాత్రకళాకారుడు వున్నాడని అనుకోరు. జీవితంలో ఒక్కసారయినా గాత్రకచేరీ ఇచ్చి తన నైపుణ్యాని ప్రదర్శించాలనే కోరిక అతనిలో అవ్యక్తంగా కొనసాగుతు వుంటుంది. వియ్యంకుడు జెర్రీ వచ్చి, గ్లియాన్ కార్లో కోరికను నెరవేరుస్తాడు.

2.  జెర్రి
జెర్రి ఒకప్పుడు ఒపేరా డైరెక్టరుగా ఒక వెలుగువెలిగాడు. విశ్రాంత జీవితం మీద అతనికి తీవ్ర అసంతృప్తి వుంటుంది. ఏదో ఒకటి చేసి, తనేంటో నిరూపించుకుని, ఒపేరా ప్రపంచంలో మళ్ళీ ఒక వెలుగు వెలగాలని తపిస్తుంటాడు. గతంలో అతను పనిచేసిన ఒపేరా కంపెనీ కార్మికుల సమ్మె వల్ల మూతపడిపోయింది. అంచేత అతనికి కమ్యూనిస్టులంటే గిట్టదు. తన కూతురు ఒక కమ్యూనిస్టును ప్రేమించడం అతనికి గిట్టదు. తనకు కాబోయే వియ్యంకుడిలో గాత్రకళ వుందని గమనిస్తాడు. అతని గాత్ర సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసి తన సత్తాను మరోసారి రుజువు చేయాలనుకుంటాడు. సాంప్రదాయానికి విరుధ్ధంగా కొన్ని ప్రయోగాలు చేసి, వియ్యంకుడికి మంచి గుర్తింపు తెస్తాడు. సాంప్రదాయాన్ని భంగపరచినందుకు మీడియాలో విమర్శలు వచ్చినా  పట్టించుకోడు.

3.    మీకెల్యాంజిలో
గియన్ కార్లో పెద్ద కొడుకు. లా పూర్తిచేశాడు. న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలెట్టాడు. అతను కమ్యూనిస్టు. ప్రతి అంశాన్నీ  కార్మికవర్గ దృక్పధంతో చూస్తుంటాడు. అమెరికా నుండి వచ్చిన పర్యాటకురాలు హేలీని ప్రేమిస్తాడు. కాబోయే మామా కమ్యూనిస్టు వ్యతిరేకి కావడాన అతనితో తరచూ గొడవ పడుతుంటాడు. తండ్రితో బలవంతంగా గాత్ర కచేరీ ఇప్పించడం కూడా అతనికి నచ్చదు. తండ్రి ప్రదర్శన విజయవంతం అయినప్పుడు అందరికన్నా అతనే ఎక్కువ ఆనందిస్తాడు.

4.    హేలీ
హేలీ అమెరికా నుండి రోమ్ నగరానికి వచ్చిన ఆర్ట్ కలెక్టర్. జెర్రీ కూతురు.  రోమ్ నగరంలో మికెల్యాంజిలో ప్రేమలో పడుతుంది. కమ్యూనిస్టూ అయిన ప్రియుడుకీ, కమ్యూనిస్టు వ్యతిరేకి అయిన తండ్రికీ మధ్య నలిగిపోతుంటుంది. ఆమే తండ్రిదేమో అతిచొరవ.కాబోయే మామగారు అంతర్ముఖుడు.  చివరకు ఆమె కథ సుఖాంతమౌతుంది.

5.    ఫిల్లీస్
ఫిల్లీస్  సైకాలజీ ప్రొఫెసర్. జెర్రీ భార్య. ఒక గంభీరమైన పాత్ర. కూతురికి నచ్చిన వాడికే ఇచ్చి పెళ్ళి చేయాలని అనుకుంటుంది. వియ్యంకుల మీదికి దురుసుగా పొయే భర్త జెర్రీని తరచూ అదుపుచేస్తూ వుంటుంది. పత్రికల్లో వ్యతిరేకంగా వచ్చిన సమీక్షల గురించి భర్తకు తెలియకుండా జాగ్రత్తపడుతుంది.



6.  మరియాంగెలా
గ్లియాన్ కార్లో భార్య మరియాంగెలా. పల్లెటూరి మనిషి.అంతగా చదువుకోలేదు. ఎప్పుడు బిక్కుబిక్కుమంటు వుంటుంది. 

7.  ఆంటోనియో
చిన్న పట్టణంలో  సైను బోర్డులు రాసుకుని బతికే చిన్న పేయింటరు. రోమ్  నగరంలో ఐశ్వర్యవంతురాలైన ఒకామె అతనికి వేలువిడిచిన మేనత్త అవుతుంది. కొత్త గా పెళ్ళి చేసుకుని, కాపురం కూడా పెట్టకుండానే భార్య మిలీని తీసుకుని రోమ్ నగరానికి వస్తాడు. మేనత్త దయతలిస్తే కారూ, బంగ్లా వున్న మంచి జీవితం తనకు దొరుకుతుందని ఆశిస్తాడు. బ్యూటీ పార్లర్ కు వెళ్ళిన భార్య రోమ్ నగరంలో దారి తప్పిపోతుంది. నాటకీయంగా ఒక వేశ్యను తన భార్యగా చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. సాధారణ జీవితాన్ని గడిపిన ఆంటోనియో రోమ్ నగర ఐశ్వర్యవంతుల మధ్య ఇమడలేకపోతాడు. భార్యను తన కళ్ల ముందే ఒక సినిమా హీరో కవ్విస్తున్నా అడ్డుపడలేకపోతాడు. జీవితంలో తొలి సెక్స్  అనుభవాన్ని ఆ వేశ్యతోనే పొందుతాడు. నగరం చెడ్దదనీ, అది తననూ తన భార్యను కూడా చెడగొట్టిందని భావించే సున్నిత మనస్కుడు. భార్యతోపాటు స్వంత ఊరికి వెళ్ళి సామాన్య జీవితాన్ని గడపడమే మేలనుకుంటాడు.

8.  మిల్లీ
చిన్న పట్టణంలో స్కూలు తీఛర్ ఆమె. ఒక సామాన్యుడు, అమాయకుడూ అయిన ఆంటోనియోను పెళ్ళి చేసుకుని, అతనితోపాటూ రోమ్ మహానగరానికి వస్తుంది. ఐశ్వర్యవంతులైన భర్త బంధువుల్ని ప్రసన్నం చేసుకోవాలంటే కాస్త అందంగా కనిపించాలని అమాయకంగా నమ్మి సెలూనును వెతుక్కుంటూ రోమ్ నగర వీధుల్లో దారి తప్పిపోతుంది. దారిలో సినిమా షూటింగ్ జరుగుతుంటే పియా పసూరి అనే హీరోయిన్ను, లూకా సాల్టా అనే హీరోను కలుస్తుంది. మీ సినిమాలు ఒక్కటీ వదలను. మీ నటనను చూసి మైమరచిపోతాను అంటుంది. లూకా సాల్టా లంచ్ కు పిలిస్తే అదో మహాభాగ్యంగా భావించి అతని వెంట వెళుతుంది. ఆ తరువాత అతనితో హొటల్ రూముకూ వెళుతుంది. అంతవరకూ వెళ్ళాక అతనితో సెక్స్ లో పాల్గొవడానికి జంకుతుంది. ఏ గుర్తింపూలేని తనను లూకా సాల్టా అంతటి హీరో నీ సాంస్కృతిక విలువల్ని గౌరవిస్తాను అని అనగానే మైమరచిపోతుంది. వచ్చిన అవకాశాన్ని వదులుకుని జీవితాంతం బాధ పడడమా? అనే మీమాంస నుండి బయటపడి  ఒక పెద్ద  హీరోతో పడుకుని అదొక అనుభవం అనుకుని ఆ తరువాత  మరచిపోవాలని నిర్ణయించుకుంటుంది.  అంతలో హీరో భార్య హొటల్ రూమ్ మీద దాడి చేయడంతో కథ అడ్దం తిరిగి ఒక దొంగతో సెక్స్ లో పాల్గొంటుంది. భర్త కూడా మరో పధ్ధతుల్లో దెబ్బతినడంతో దంపతులిద్దరూ రోమ్ నగరానికి ఒక దణ్ణం పెట్టి స్వంత ఊరికి వెళ్ళిపోతారు. 

9.  అన్నా
అన్నా కమ్మర్షియల్ సెక్స్ వర్కర్. ఎవరో ఆమెను ఒక రాత్రికి బుక్ చేసి హొటల్లోబస చేసిన ఒక అతిధి దగ్గరికి పంపిస్తారు. మిల్లీ బయటికి వెళ్ళిన సమయంలో పొరపాటున అంటోనియో గది లోనికి ప్రవేశిస్తుంది అన్నా.  ఫీజు మందే ముట్టింది గనుక ఒక రోజు తనను ఎలా గయినా వాడుకోమంటుంది. బిడియస్తుడయిన ఆంటోనియో ఆమెను బయటికి పంపించే ప్రయత్నం చేస్తుండగా  బంధువులు గదిలోనికి వచ్చేస్తారు. విధిలేక అన్నానే వాళ్ళకు తన భార్యగా పరిచయంచేస్తాడు ఆంటోనియో. అన్నా పూర్తి ప్రొఫెషనల్. డబ్బు ముట్టింది కనుక కొత్త పాత్రకూ సరే నంటుంది. ఆ మధ్యహ్నం ఆంటొనియోతో పాటూ లంచ్ కు వెళుతుంది. ఆంటొనియో భార్యను మరొకరు కవ్వించడం చూసి అర్భకుడైన ఆంటోనియో మీద జాలిపడుతుంది. ఆ రాత్రి డిన్నర్ లోనూ ఆంటొనియోకన్నా అన్నాయే ముఖ్య అతిథిగా మారిపోతుంది. ఆంటోనియోకు అప్పటి వరకు సెక్స్  యోగం లేదని తెలిసి హొటల్ గార్డెన్ లో ఆరుబయట ఆ అవకాశం కల్పిస్తుంది.

10.              లూకా సాల్టా
లూకా సాల్టా ఇటలీలో సూపర్ స్టార్. బయట బూటకపు బతుకు బతుకుతున్నా లోపల అతనో పిల్లవాడు. చిలిపి మనిషి. మృదు స్వభావి. దేశంలో అతనికి లక్షలాది అభిమానులున్నప్పటికీ సంసార జీవితంలో ఇబ్బందులున్నాయి. అతనితో విడిపోయిన భార్య విడాకులు ఇవ్వడానికి భారీ పరిహారాన్ని కోరుతోంది. వివాహేతర సంబంధం కేసులో  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని లూకా మీద ఒక ప్రైవేటు గూఢాచారిని నియమిస్తుంది.   మిలీ అనే అమ్మాయి తనను కలిసి మీ సినిమాలు ఒక్కటీ వదలకుండా ప్రతిదీ చూస్తాను. మిమ్మల్ని తెరమీద చూస్తున్నంత సేపూ మైమరచిపోతాను. మీరంటే పడిచస్తాను అన్నప్పుడు అతనిలో స్త్రీ వ్యామోహం కలుగుతుంది. ఒకమ్మాయి పబ్లిగ్గా అంతమాట అన్నదంటే రహాస్యంగా పడగ్గదికి వస్తానని సంకేతం ఇచ్చినట్టే అని లూకా సాల్టా భావిస్తాడు. మిల్లీని మధ్యాహ్నం  లంచ్ కూ, సాయంత్రం షూటింగుకూ, రాత్రి హొటల్ గదికీ తీసుకు వెళతాడు. ఏ గుర్తింపూ లేని మిల్లీ నైతిక ప్రమాణాల్ని మెచ్చుకుంటాడు. తనలో అణిచివుంచిన పిల్లవాడిని బయటికి తీస్తాడు. మిల్లీతో సెక్స్ లో పాల్గొనడానికి సిధ్ధపడుతున్న సమయంలో హొటలో రూము లోనికి వెనక నుండి ఒక దొంగ ప్రవేశిస్తాడు. ముందు డోర్ నుండి అతని భార్య, లాయర్ తోపాటూ ప్రవేశిస్తుంది. మిల్లీని ఆ గొంగను భార్యా భర్తలుగా నటించమని వేడుకుని బాత్ రూమ్ లో దాక్కుంటాడు లుకా సాల్టా. భార్య గండం గడిచాక. పరువును కాపాడినందుకు తన దగ్గర వున్న డబ్బులు, ఆభరణాలు అన్నీ ఇచ్చేసి, మిల్లీని కూడా ఆ దొంగకు అప్పగించి వెళ్ళిపోతాడు. 

11.              హొటల్ దొంగ
ఇతన్నెవరూ పేరుపెట్టి పిలవరు కనుక ఈ పాత్రకు పేరు  అవసరంలేదు. ఇతనొక దొంగ. డ్రైనేజి గొట్టాలమీదుగా పైకి ఎక్కి  బాత్ రూమ్ కిటీకీల హొటల్ గదుల్లోకి ప్రవేశించడంలో నిపుణుడు. ఒక రోజు బాత్ రూమ్ కిటీకీ గుండా ఒక గదిలోకి ప్రవేశిస్తే అక్కడ మిల్లీ అనే ఆమె వుంటుంది. ఆమె మీద రివాల్వర్ గురి పెట్టి, ఆమె ప్రియుడు లూకాసాల్టా అనే సినీ హీరోను బెదిరించి, డబ్బు, ఆభరణాలు ఇమ్మంటాడు. ఆ తరువాత కథలో ట్విస్టుల మీద ట్విస్టులు జరిగి ఆ దొంగ పంట పండుతుంది.  లూకా సాల్టాను గొంగ బెదిరిస్తున్న సమయంలో సినీ హీరో భార్య కొందరు సాక్షులతోవచ్చి వచ్చి తలుపు కొడుతుంది. భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే మరింత ప్రమాదం అని భయపడ్డ సినీ హీరో తన ప్రియురాలికి ప్రియుడిగా నటించమని  దొంగను బతిమాలుతాడు. ఆపద నుండి కాపాడి నందుకు డబ్బూ దస్కంతోపాటూ సినీ హీరో ,ప్రియురాలు కూడా బోనస్ గా దొంగకు దక్కుతుంది. అవకాశం మనిషిని దొంగగా మార్చినట్టు, అవకాశం వచ్చినపుడు అమ్మాయిని కూడా అనుభవించేయాలి  అనే ఫిలాసఫీ అతనిది.

12.              జోయన్
జోయన్ రోమ్ నగరంలో సాంఒప్రదాయిక ఐశ్వర్యవంతురాలు. సంస్కృతి, సాంప్రదాయాలకు ఎక్కువ విలువ ఇచే మనిషి. దాయాది అన్న కొడుకయిన ఆంటోనియోకు దయతో ఒక బతుకు తెరువు ఏర్పాటు చేయాలనుకుంటుంది. అయితే, అంటోనియో అర్భకత్వం, అతని భార్యగా వచ్చినామె  (నిజానికి ఆమె భార్యకాదు ఒక బజారు వేశ్య)  కురచ బట్టలు, విచలవిడితనం ఆమెకు నచ్చవు, ఆంటోనియోను వెంట బెట్టుకుని రోమ్ నగర సాంస్కృతిక వైభవాన్ని చూపిస్తుంది. నగర ప్రముఖులకు ఆంటోనియోను పరిచయం చేయడానికి ఇక పెద్ద విందును ఏర్పాటు చేస్తుంది.  

13.              లూకా సాల్టా భార్య
లుకాసాల్టా భార్య భర్తతో విడిపోయింది. విడాకుల కోసం అప్లయి చేసింది. లూకాకు  వివాహేతర సంబంధాలున్నట్టు  నిరూపించి భారీ భరణాన్ని రాబట్టవచ్చని సమయం కోసం ఎదురు చూస్తూ వుంటుంది. లూకా మీద నిఘా వుంచడానికి ఒక ప్రైవేటు డిటెక్టివ్ ను నియమిస్తుంది. లూకా హొటల గదిలో వున్నప్పుడు సమాచారం అంది దాడి చేస్తుంది. కానీ, లూకా తప్పించుకోవడంతో తీవ్ర అసహనానికి గురవుతుంది.

14.              పియా ఫుసారి
సుప్రసిధ్ధ నటి. మంచి మనిషి.. షూటింగు చూడడానికి వచ్చిన మిలీతో ఆప్యాయంగా మాట్లాడుతుంది. మిలీ లూకాసాల్టా అభిమాని అని తెలుసుకుని ఆ సూపర్ స్టార్ కు పరిచయం చేస్తుంది.



15.              జాన్
జాన్ అమెరికాలో ప్రముఖ ఆర్కెటెక్ట్. భార్యా, స్నేహితులతో రోమ్ నగరానికి విహారయాత్రకు వచ్చాడు.తనికి రోమ్ నగరంతో ప్రగాఢ అనుబంధం వుంది. అతను రోమ్ నగరంలోనే డిగ్రీ చదివాడు. అప్పట్లో తనను ఎంతగానో అభిమానించే అమ్మాయిని నిర్లక్ష్యం చేసి, కాలేజీకి కొత్తగా వచ్చిన ఓ మెరుపుతీగ వెంటపడి ఘోరంగా దెబ్బతిన్నాడు. కాలేజీ రోజుల్లో తను నివసించిన ఇంటిని చూడడానికి వెళ్ళిన జాన్ కు అదే ఇంట్లో నివాసం వుంటున్న జాక్ పరిచయం అవుతాడు. కాలేజీ రోజుల్లో అమ్మాయిల విషయంలో తాను చేసిన తప్పునే జాక్ చేస్తుంటే వారించే ప్రయత్నం చేస్తాడు. అయినా జాక్ వినడు. వయసుతో పాటూ జ్ఞానం వస్తుంది. కానీ, అప్పటికే జరగకూడనివన్నీ జరిగిపోయి అలసట వచ్చేస్తుంది. వయసుతో పాటూ జ్ఞానం వస్తుంది. కానీ, అప్పటికే జరగకూడనివన్నీ జరిగిపోయి అలసట వచ్చేస్తుంది.
అని గమనిస్తాడు.

జాన్ పాత్రలో ఒకమార్మికత వుంది. జాక్, శాలీ, మోనికా, లొయోనార్డో అనే వాళ్ళు నిజమైన పాత్రలో, లేక జాన్ తన గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడో  అనే సంధిగ్ధం తేలదు. జాన్ సన్నివేశాల్ని ప్రేక్షకులు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఊహించుకోవచ్చు.

16.              జాక్
రోమ్ లో ఆర్కెటెక్ట్ విద్యార్ధి. శాలీ అనే సహ విద్యార్ధినితో  సహజీవనం చేస్తుంటాడు.   శాలీనీ స్నేహితురాలు మోనిక రావడంతో మనిషి మారిపోతాడు. మోనిక వ్యామోహంలో పడిపోతాడు. పది మందిని చూసిన మోనికలాంటి అమ్మాయిని దక్కించుకున్నవాడే సిసలైన మగాడు అనుకుంటాడు. శాలీని పక్కన పెడతాడు. తనూ, మోనిక పెళ్ళి చేసుకుంటున్న విషయాన్ని శాలీకి అప్పుడే చెప్పకూడదనీ, ఆమె  పరీక్షలు పూర్తికాగానే చెప్పాలని అనుకుంటాడు. కానీ, మోనికకు కెరీర్ తప్ప ప్రేమ దోమ సంసారం అనేవి పట్టవు అని తెలుసుకునే సమయానికే శాలీకి కూడా దూరం అయిపోతాడు.


17.              మోనిక
మోనిక హాలివుడ్ లో వర్ధమాన నటి. తన రంగంలో అగ్రస్థానానికి ఎగబాకాలనేది ఆమె ఏకైక లక్ష్యం. ఆమె శృంగార జీవితంలో విపరీతమైన విచ్చలవిడితనం వుంటుంది.  గే తో కొన్నాళ్ళు కాపురం చేస్తుంది. లెజ్బియన్ తో ఒక అనుబంధాన్ని కొనసాగిస్తుంది. బాయ్ ఫ్రెండ్ తో చెడిపోవడంతో కొన్నాళ్ళు మనశ్శాంతి కోసం తన స్నేహితురాలు శాలీ దగ్గరికి రోమ్ వస్తుంది. కష్టాల్లో ఏడుస్తూ కూర్చునే రకంకాదామే.  మగవాళ్లను తమ చుట్టూ తిప్పుకుంటేనే అమ్మాయుల ఆకర్షణ మరింత పెరుగుతుందని గట్టిగా నమ్మే మనిషామె. అందంతో, తెలివితో, సంస్కృతితో, సాంకేతిక పరిజ్ఞానంతో, ఆధునికతతో మగవాళ్లను ఆకర్షించే మెళుకువలన్నీ ఆమెకు బాగా తెలుసు. తనకు ఆశ్రయం ఇచ్చిన శాలీ బాయ్ ఫ్రెండ్ జాక్ నే వలలో వేసుకుంటుంది. ఫ్రెండ్ ఇంట్లోనే ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ లో పాల్గొంటుంది. గొప్ప అవకాశవాదాన్ని అనుసరిస్తూనే ఎంతో ఉదారవాదిగా నటిస్తూ వుంటుంది. అతన్ని రంగురంగుల కలల్లో ముంచేస్తుంది. హాలివుడ్ లో మంచి అవకాశం రాగానే కొత్త ప్రియుడ్ని నడిరోడ్డున వదిలి వెళ్ళిపోతుంది.

18.              శాలీ
శాలి కాలేజీ స్టూడెంటు. కోరి కష్టాలు తెచ్చుకునే సహృదయురాలు. ఎప్పుడూ ఇతరుల మేలు కోసం ఆలోచిస్తూ వుంటుంది. తన బాయ్ ఫ్రెండ్ జాక్ తో ఒకే ఇంట్లో సహజీవనం చేస్తూ వుంటుంది. కష్టాల్లో వున్న తన  స్నేహితురాలు మోనికను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది. ఆమెకు కాస్త కంపెనీ ఇచ్చే బాధ్యతను తన  బాయ్ ఫ్రెండ్ కే అప్ప చెపుతుంది. మోనిక కోసం తనే లియోనార్డ్  ఒక బాయ్ ఫ్రెండ్ ను వెతికిపెడుతుంది. కానీ, తను ఆదుకున్న మోనిక తన బాయ్ ఫ్రెండ్ నే వలలో వేసుకుందని గమనించలేని అమాయకురాలు.





19.              లియోనార్డో
లియోనార్డో కాలేజి విద్యార్ధి. గర్ల్ ఫ్రెండ్ తో విడిపోయాడు. బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిన మోనికకు గర్ల్ ఫ్రెండ్ తో విడిపోయిన లియోనార్డొతో జత చేయాలని శాలీ భావిస్తుంది. లియోనార్డో మోనికకు దగ్గరఅవుతుంటే శాలీ బాయ్ ఫ్రెండ్ జాక్ కు అసూయగా వుంటుంది.

20.              లియోపోల్డో
లియోపోల్డో ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీసులో చిన్న గుమాస్తా. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు. ఇంటి దగ్గరగానీ, ఆఫీసులోగానీ ఎలాంటి గుర్తింపులేని అర్భక జీవితం. సమాజంలో ఎవరూ అతన్నీ, అతను చెప్పే మాటల్ని  పట్టించుకోరు. ఆఫీసులో బాస్ వ్యక్తిగత కార్యదర్శి సెరఫీనను అందరూ లొట్టలేసుకుని చూస్తున్నట్టే తనూ చూస్తుంటాడు. సెరఫీన (తనతో పడుకోక పోయినా) తనతో చిరునవ్వు చిందిస్తు ఒక్కసారి మాట్లాడితే చాలనే అల్పసంతోషి. పాపరజ్జీలకు ఒకరోజు మరెవరూ దొరక్క పోవడంతో లియోపోల్డొను తాత్కాలిక సెలబ్రెటీగా మార్చేస్తారు. వద్దువద్దను కుంటూనే అతను సెలబ్రెటీ జీవితాన్ని ఆస్వాదించడం మొదలెడతాడు. రోమ్ లో జరిగే ప్రతి ఫంక్షనుకూ అతనే ముఖ్య అతిథిగా మారిపోతాడు. సెలబ్రెటీలు కనుక అతను  వాడే అండర్ వేర్ లు కూడా టీవీల్లో చర్చనీయాంశంగా మారిపోతాయి. పేరూ ప్రతిష్టలు రావడంతో అతనితో పడుకోవడానికి సెరఫీనతో సహా అందమైన అమ్మాయిలు అనేక మంది క్యూ కడతారు.  సెలబ్రెటీ జీవితాన్ని గొప్పగా ఆస్వాదిస్తున్న కాలంలో పాపరజ్జీలు హఠాత్తుగా లియోపోల్డోను వదిలేసి కొత్త సెలబ్రెటీని పట్టుకుంటారు. సామాన్య జీవితం ఒకటిరెండు రోజులు బాగున్నట్టు అనిపించినా,  సెలబ్రెటీ జీవితం పోవడంతో లియోపోల్డో పిచెక్కినట్టు అవుతుంది. నడిరోడ్డు మీద బట్టలూడ దీసుకుని  పిచ్చిగా ప్రవర్తిస్తాడు. డ్రైవరూ ఉపదేశంతో, భార్య సాంత్వన మాటలతో శాంతిస్తాడు.

21.              సోఫియా
లియోపోల్డో భార్య. అనుకూలవతి.  ఇద్దరు పిల్లల తల్లి. భర్త కష్టాల్లో వున్నప్పుడు భరిస్తుంది. సుఖాల్లో వున్నప్పుడు ఆస్వాదిస్తుంది. భర్తకు వెర్రెక్కినపుడు బుజ్జగించి ఇంటికి తీసుకుపోతుంది.

22.              సెరఫీన
సెరఫీన అందమైన యువతి. ఒక కార్పొరేట్ బాస్ కు వ్యక్తిగత కార్యదర్శి. సెలబ్రెటీల డబ్బుకు తన అందాన్ని జోడించి జీవితాన్ని ఆస్వాదించాలనుకునే మనిషి. లియోపోల్డో సామాన్యుడిగా వున్నప్పుడు అతని వైపు కన్నెత్తి కూడా చూడని మనిషి సెరఫీన.  లియోపోల్డో సెలబ్రెటీగా మారిపోయాక అతనితో తను పడుకోవడమేగాక, అతనితో మంఛం పంచుకోవడానికి తన స్నేహితురాళ్లను కూడా తీసుకునివస్తుంది.

23.              రాబెర్టో
సెలిబ్రెటీల డ్రైవరు. లియోపార్డో సెలబ్రెటీగా మారినప్పుడు అతని దగ్గర డ్రైవరుగా చేరుతాడు. లియోపార్డో సెలబ్రెటీ దశ ముగియగానే వేరే చోటికి పోతాడు. సెలబ్రెటీల దగ్గర పని చేయడంవల్ల అతనికి జీవిత తత్వం బోధపడుతుంది. సమస్యలు అందరికీ వుంటాయి. సామాన్యులకూ సమస్యలు వుంటాయి. సెలబ్రెటీలకూ సమస్యలు వుంటాయి. అయితే, సామాన్యులుగా వుండి సమస్యల్ని ఎదుర్కోవడంకన్నా సెలబ్రెటీలువుండి సమస్యల్ని ఎదుర్కోవడం ఆనందంగా వుంటుంది అని అతను గ్రహిస్తాడు. ఆ విషయాన్నే చివర్లో లియోపార్డోకు హితోపదేశం చేస్తాడు.

24.              మారిసా రగూసో
టెలివిజన్ లో స్టార్ యాంకర్.  సెలెబ్రెటీ షోలను నిర్వహిస్తుంది. గొప్పగొప్పవాళ్లను చెత్తచెత్త ప్రశ్నలు వేస్తుంది. లియోపోల్డోతో లైవ్ షో నడుపుతుంది.

25.              పారరజ్జీలు
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను బజారు కీడ్చే మీడియా స్ట్రింగర్లు. ఏరోజైనా సెలబ్రెటీలు దొరక్కపోతే తమ వార్తలకోసం ఎవడో ఒకడ్ని సెలబ్రెటీలుగా మార్చేస్తుంటారు.





To Rome With Love (2012 )
కథ
(ఎలా చెపుతున్నాం )

1.  జెర్రీ - గ్లియాన్ కార్లో  కథ
విశ్రాంత ఒపెరా డైరెక్టర్ జెర్రీ తనకు వయసు మళ్ళినా ఇంకా ఏదో ఒకటి చేస్తూ వెలుగులో వుండాలని తపిస్తుంటాడు. తనలో గొప్ప గాత్రకళ వుందని తెలియని గియన్ కార్లో శవపేటికల వ్యాపారిగా బతుకు సాగిస్తుంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఘర్షతో మొదలయిన పరిచయం అనుబంధంగా  మారుతుంది.

అమెరికాకు చెందిన  ఆర్ట్  కలెక్టర్ హేలీ రోమ్ నగరానికి విజ్ఞాన యాత్రకు వస్తుంది. అక్కడ మికేల్యాంజిలో అనే యువ లాయర్ తో ప్రేమలో పడుతుంది.  మికేల్యాంజిలో కమ్యూనిస్టు. అతని తండ్రి గియన్ కార్లో శవపేటికల వ్యాపారి.

హేలీ తండ్రి జెర్రి ఒకప్పుడు ఒపేరా దర్శకుడు. కాబోయే వియ్యంకుల్ని కలవడానికి భార్య ఫిల్లిస్ తో పాటూ రోమ్ కు బయలుదేరుతాడు జెర్రి.  కూతుర్ని కమ్యూనిస్టులకు ఇచ్చి పెళ్ళిచేయడం అతనికి ఇష్టంవుండదు. వియ్యంకుడు శవపేటికల వ్యాపారి అని తెలిసి మరీ చీదరించుకుంటాడు. గియన్ కార్లో బాత్ రూమ్ లో లా స్కాలా గాత్రసంగీతాన్ని అద్భుతంగా ఆలపిస్తుంటే జెర్రీ మైమరచిపోతాడు.  గియన్ కార్లో పూర్వికులు ప్రతిష్టాత్మక పాగ్లియాచ్చి ఒపేరా కళాకారులు అని తెలిసి  ఆశ్చర్యపోతాడు.

ఒక అద్భుత గాయకుడి నైపుణ్యం బాత్ రూమ్ లో అంతం అయిపోకూడదు అనుకుంటాడు. అతన్ని ప్రపంచానికి పరిచయం చేసి, విశ్రాంత జీవితంలో ఒపెరా డైరెక్టరుగా తన ఘనతను  మరో మారు  నిరూపించుకోవాలనుకుంటాడు జెర్రి. గియన్ కార్లో కు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆడిషన్ కు ఒప్పిస్తాడు. తొలి  ప్రయత్నంలో గియన్ కార్లో ఘోరంగా విఫలమౌతాడు. తన ప్రతిభను చాటుకోవాలనే స్వార్ధంతో జెర్రీ తన తండ్రిని అనవసరంగా మానసిన క్షోభకు గురిచేశాడని మికేల్యాంజిలోకు మామ మీద కోపం వస్తుంది. అయినా జెర్రీ తన పట్టుదలను విడువడు. బాత్ రూమ్ లో బట్టలూడదీసి షవర్ కింద నిలబడి స్వేఛ్ఛా, సౌకర్యాలను ఆస్వాదిస్తున్నపుడే  గియన్ కార్లో గొప్పగా పాడగలడని గుర్తిస్తాడు. సంచార షవర్ ఒకదాన్ని వేదిక మీద ఏర్పాటుచేసి డెల్ ఒపేరాలో గియన్ కార్లోతో ప్రదర్శన లిప్పిస్తాడు జెర్రీ. ఆ ప్రయోగం గొప్పగా విజవంతమౌతుంది. ఆ ఉత్సాహంలో తనకు ప్రతిష్ఠాత్మక  పాగ్లియాచ్చి ప్రదర్శన ఇవ్వాలనే కోరిక వుందని గియన్ కార్లో బయట పెడతాడు. జెర్రీ ఆ కోరికను కూడా నేరవేరుస్తాడు. గియన్ కార్లో పాగ్లియాచ్చి ప్రదర్శనను విపరీతంగా మెచ్చుకుంటూ పత్రికలు సమీక్షలు ప్రచురిస్తాయి. అయితే, సాంప్రదాయ ఒపేరాలో సంచార షవర్ ను ఏర్పాటు చేసిన దర్శకుడు జెర్రీ తల నరికివేయాలని తీవ్రంగా విమర్శిస్తాయి. ఇటాలియన్ భాష రాకపోవడం వల్ల జెర్రీకి ఆ విషయం తెలీదు.  కుటుంబ సభ్యులు కూడా  విమర్శల గురించి జెర్రీకి తెలియకుండా జాగ్రత్త పడతారు. తన జీవితకాల కోరిక నెరవేరింది గనుక ఇక విశ్రాంతి తీసుకుంటానంటాడు గియాన్ కార్లో. రెండు కుటూంబాల మధ్య అనుబంధం పెరుగుతుంది. హేలీ మికేల్యాంజిలోల పెళ్ళికి రంగం సిధ్ధమౌతుంది.

2. ఆంటోనీయో మిలీ కథ
బంధువుల సహకారంతో సౌకర్యవంతమైన  జీవితాన్ని గడపాలని, ఒక చిన్న పట్టణం నుండి  పుట్టెడు ఆశలతో రోమ్ నగరానికి వచ్చారు అమాయకపు కొత్త దంపతులు ఆంటోనియో, మిలీ, కానీ, విధి వక్రీకరించి, ఆంటోనియో ఒక వేశ్యను తన భార్యగా పరిచయం చేసుకోవాల్సిరాగా, మిల్లీ ఒక దొంగతో శృంగారంలో పాల్గొంటుంది.

కొత్తగా పెళ్ళి చేసుకుని శోభనం కూడా జరక్క ముందే భార్య మిలీని తీసుకుని రోమ్ మహానగరానికి వచ్చాడు ఆంటోనియో.  భార్యా భర్తలు ఒక హొటలు గదిలో బస చేశారు. ఆంటోనియో మేనత్త రోమ్ నగరంలో ఐశ్వర్యవంతురాలు.  ఆమె మన్ననలు  పొందితే మంచి ఉద్యోగం, మంచి ఇల్లు, మంచి జీవితం దక్కుతుందని ఆశగా చెపుతాడు ఆంటోనియో. భర్త బంధువుల్ని ప్రసన్నం చేసుకోవడానికి కాస్త మంచిగా కనిపించాలి కనుక, బ్యూటీ పార్లర్ కు వెళ్లి వస్తానని బయటికి పోతుంది మిల్లి.  రోమ్ నగర వీధుల్లో ఆమె తప్పిపోతుంది. ఆ కంగారులో ఆమె సెల్ ఫోన్ డ్రైనేజీలో పడిపోతుంది. రోడ్డు మీద సినిమా షూటింగు జరుగుతుంటే ఆగుతుంది. అక్కడ తన అభిమాన హీరో లూకా సాల్టాను కలుస్తుంది. ఆమెను తనతోపాటూ లంచ్ కు రమ్మంటాడు లూకా. 

భార్య తిరిగి రాలేదని హొటలు గదిలో కంగారు పడుతుంటాడు ఆంటోనియో. వేరే గదిలోని ప్యాసింజరుకు బుక్ అయిన అన్నా అనే వేశ్య పొరపాటుగా ఆంటోనియో గదిలోనికి వస్తుంది. అమెను బయటికి పంపే ప్రయత్నంలో  వుండగా, ఆంటోనియో బంధువులు వస్తారు. ఆ సమయంలో అన్నా, ఆంటోనియోల్ని శృంగార భంగిమలో చూసిన బంధువులు వాళ్ళిద్దర్ని దంపతులు అనుకుంటారు.  ఇక చేసేదేంలేక అన్నాను తన భార్యగా నటించమని ప్రాధేయపడతాడు ఆంటోనియో. తనకు ఎలాగూ ముందే పేమెంట్ వచ్చేసింది గనుక అన్నా కూడా ఒప్పుకుంటుంది.

అన్నా ను తీసుకుని బంధువుల వెంట లంచ్ కోసం హొటలుకు వెళతాడు ఆంటోనియో. సరిగ్గా అదే హొటలుకు మిల్లీని తీసుకువస్తాడు హిరో లూకా సాల్టా. అక్కడ  ఆంటోనియోను మిలీ గమనించదు. కానీ, మిలీని లుకా సాల్టా కవ్విస్తుండడాన్ని చూసి ఆంటోనియో లోలోపల రగిలిపోతాడు.

ఆంటోనియోనూ రోమ్ నగర ప్రముఖులకు పరిచయం చేయడానికి అతని మేనత్త  ఆ రాత్రి ఒక పెద్ద హోటల్ లో పెద్ద విందు ఏర్పాటు చేస్తుంది. నగర ప్రముఖులు ఆంటోనియోకన్నా అన్నా మీద ఎక్కువ ఆసక్తి కనపరుస్తుంటారు. వాళ్ళు ఆమెకు పాత ఖాతాదారులు. వాళ్ల మధ్య తనలాంటి అర్భకుడికి స్థానం లేదని  ఆంటోనియోకు వెంటనే అర్ధం అవుతుంది. అతను అన్నాను తీసుకుని హొటల్  గార్డెన్ లోనికి వెళతాడు.  వాళ్ల మాటల్లో ఆంటోనియోకు అంత వరకు శృంగార అనుభవం లేదని తెలిసి న్నా జాలిపడుతుంది. అతన్ని కవ్వించి పొదల మాటున శృంగార అనుభవాన్ని అందిస్తుంది.
సరిగ్గా అదే రాత్రి మిలీని హొటల్ రూముకు తీసుకు వెళ్ళి కవ్విస్తాడు లూకా సాల్టా.  మొదట్లో నిరాకరించిన మిలీ అతనితో సెక్స్ లో పాల్గోవడానికి సిధ్ధపడి దుస్తులు మార్చుకోవడానికి బాత్ రూమ్ లోనికి వెళుతుంది.  సరిగ్గా అప్పుడే ఒక దొంగ బాత్ రూం కిటికీలోంచి ప్రవేశించి మిల్లీ మెడ దగ్గర తుపాకీ గురి పెట్టి  డబ్బూ బంగారం ఇమ్మని లూకా సాల్టాను బెదిరిస్తాడు. సరిగ్గా ఆ సమయంలో లూకా సాల్టా భార్య తన ప్రైవేటు డిటెక్టివ్ తోపాటూ. హొటల్ మేనేజర్ ను వెంట బెట్టుకుని  భర్తను రెడ్ హ్యాండేడ్ గా పట్టుకోవాలని వస్తుంది. దొంగను బతిమిలాడి, మంచం మీద మిల్లీ తో పాటూ పడుకోబెట్టి తాను వెళ్ళి బాత్ రూంలో దాక్కుంటాడు లూకా సాల్టా.  లూకా భార్య బృందం లోపలికి వచ్చి  బెడ్ మీద మిల్లీ, దొంగను చూసి, సాల్టా లేడని నమ్మి తిరిగి వెళ్ళిపోతారు. ఆ తరువాత సాల్టా బాత్ రూం నుండి బయటికి వచ్చి తనను కాపాడినందుకు దొంగకు ధన్యవాదాలు చెప్పి, డబ్బూ, బంగారంతోపాటూ మిల్లీని కూడా అప్పగించి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఆ దొంగ మిల్లీని కవ్వించి సెక్స్ లో పాల్గొంటాడు.

    మిల్లీ ఒక చేదు అనుభవంతో  భర్త దగ్గరికి తిరిగి వస్తుంది. రోమ్ మహానగరం కన్నా తమ చిన్న పట్టణమే  తమకు సురక్షితం అంటాడు భర్త. తిరుగు ప్రయాణానికి ముందు భార్యా భర్తలు తొలిసారిగా సెక్స్ లో పాల్గొంటారు.


3. జాన్ జాక్ కథ
మనం మన  గతం లోనికి ఒకసారి తొంగిచూసుకున్నప్పుడు  అప్పుట్లో చేసిన కొన్ని పనుల్ని చేసివుండాల్సిందికాదనీ, చేయడానికి నిరాకరించిన కొన్ని పనుల్ని చేసివుండాల్సిందనీ అనిపిస్తుంది. అలా మదన పడే పాత్ర ఆర్కెటెక్ట్  జాన్. అతను యవ్వనంలో వుండగా తనను ప్రేమించే అమ్మాయిని కాదని మరో అమ్మాయి వ్యామోహంలో పడి గట్టిగా దెబ్బతిన్నాడు. అప్పుడు తను అలా చేసి వుండాల్సింది కాదని  యాభైయేళ్ల వయసులో అతను అనుకున్నాడు. అయితే, తనకు పరిచయం అయిన ఓ యువకుడు సరిగ్గా  తను చేసిన తప్పే చేస్తుంటే వారించడానికి విఫలయత్నం చేశాడు. ఇంతకీ ఆ యువకుడు వాస్తవంగా వున్నాడా?  లేకపోతే ఆ యువకుడు తను నెమరు వేసుకుంటున్న తన గతమేనా?  

జాన్ అమెరికాలో సుప్రసిధ్ధ అర్కిటెక్ట్.  వేసవి శెలవులు గడపడానికి భార్యతోపాటూ రోమ్ నగరానికి వచ్చాడు. రోమ నగరంతో అతనికి చాలా అనుబంధం వుంది. అతను రోమ్ నగరంలోనే  ఇంజినీరింగ్ చదివాడు. అప్పట్లో కాలేజీ ప్రేమాయణం కూడా నడిపాడు. తనను  ప్రేమించే  ఒక నిరాడంబర అమ్మాయిని పట్టించుకోలేదు.  మెరుపులు మెరిపించి, విపరీతంగా కవ్వించే మరో అమ్మాయి మైకంలో పడి కొన్నాళ్ళు తిరిగాడు. ఒక  మంచి అవకాశం రాగానే ఆ మెరుపుతీగ జాన్ ని వదిలేసి ఎగిరిపోయింది.  

            గతాన్ని నెమరువేసుకుంటూ, ఒకప్పుడు తను నివశించిన ఇంటిని వెతుక్కుంటూ  వెళుతున్నాడు జాన్.  జాక్  అనే ఇంజినీరింగ్ విద్యార్ధి జాన్ ని గుర్తుపట్టి పలకరించాడు. తన ఇంటికి టీకి ఆహ్వానించాడు. జాక్ తన గర్ల్ ఫ్రెండ్ శ్యాలీని జాన్ కు పరిచయం చేశాడు. శ్యాలీ మంచి అమ్మాయి. నిరాడంబరంగా వుంటుంది.

సినీ నటి  మోనిక తన బాయ్ ఫ్రెండ్ తో తెగతెంపులు చేసుకుని   స్నేహితురాలు శ్యాలి దగ్గర కొన్నాళ్ళు వుండదానికి రోమ్ నగరానికి వచ్చింది. సెక్స్ వ్యవహారాలను మోనిక బహిరంగంగా మాట్లడుతుందని శ్యాలీ అంటుంది. రానున్న కీడును శంకించి జాగ్రత్తగా వుండమని జాక్ కు చెపుతాడు జాన్. మగవాళ్లలో కోరికల్ని రెచ్చగొట్టడానికి ఆడవాళ్ళు సెక్స్ కథలు చెపుతారని హెచ్చరిస్తాడు.

నలుగురితో తిరిగే అబ్బాయిలంటే కొందరు అమ్మాయిలకూ, నలుగురితో తిరిగే అమ్మాయిలంటే కొందరు అబ్బాయిలకు ప్రత్యేక ఆసక్తి వుంటుంది. అలాంటి వాళ్లతో  సెక్స్ లో పాల్గోవడం తమ  సామర్ధ్యానికి కొలమానంగా భావిస్తారు.

ఇంటికి వచ్చిన రోజే తన సెక్స్ అనుభవాలు రెండింటిని చెపుతుంది మోనిక. జాన్ వారిస్తున్నా మోనికా వ్యామోహంలో పడిపోతాడు జాక్. తన ఫ్రెండ్ లియోనార్డో మోనిక జోడీగా మారితే బాగుంటుందని శాలీ అనుకుంటుంది. మరోవైపు, జాక్ ను కవ్విస్తుంటుంది మోనిక. స్నేహితురాలి ఇంట్లో స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ లో పాల్గోవడం బాగుండదని, కారులోనికి లాక్కొని పోతుంది.

శాలీని వదిలి మోనికతో స్థిరపడాలనుకుంటాడు జాక్. అయితే, శ్యాలీ పరీక్షలు అయ్యే వరకు ఆ విషయాన్ని ఆమెకు చెప్ప కూడదు అనుకుంటాడు. శ్యాలీ పరీక్షలు ముగిసిన తరువాత ముగ్గురూ లంచ్ కు బయటికిపోతారు. ఆ రాత్రి శ్యాలీకి తమ విషయం చెప్పేస్తానంటాడు జాక్. హానీ మూన్ కు గ్రీస్, సిసిలి వెళ్ళాలని జాక్, మోనిక ప్లాన్ చేసుకుంటారు. ఇంతలో ఒక భారీ బడ్జెట్  హాలీవుడ్ సినిమాలో ఎంపికయినట్టు మోనికకూ ఫోన్ వస్తుంది. దానితో, మోనికా  హానీమూన్ మాటల్ని కట్టిపెట్టి తను లాస్ ఏంజెలెస్, టోక్యోల్లో షూటింగ్ రోజులు ఎలా గడపాలో  కలలు కనడం మొదలెడుతుంది. ఆమె ఎంత డొల్ల మనిషో అప్పుడు జాక్ కు అర్ధం అవుతుంది. మళ్ళీ శాలీతో జతకూడడానికి అతనికి అత్మన్యూనతా భావం అడ్డువస్తుంది. జాన్ జాక్ ఇద్దరూ  తాము  మొదట కలిసిన కూడలి వరకు కలిసివచ్చి ఎవరిదారినవాళ్ళు పోతారు.

4. లియోపోల్డో రాబర్ట్స్ కథ
కష్టాలనేవి అందరికీ వుంటాయి.  పేదవాళ్లకు ఎలాగూ కష్టాలే వుంటాయి. ధనవంతులకు వాళ్ల కష్టాలు వాళ్ళకు వుంటాయి.  అయితే, పేదవాళ్ళుగా వుండి కష్టలను అనుభవించడంకన్నా,  ధనవంతులుగా వుండి కష్టాలను ఆస్వాదించడమే బాగుంటుంది.

లియోపోల్డో పిసనెల్లో ఒక సామాన్య మధ్యతరగతి జీవి. భార్యా, ఇద్దరు పిల్లలు, గుమాస్తా ఉద్యోగం, ఎలాంటి  గుర్తింపులేని సాదాసీదా జీవితం అతనిది. అఫీసు బాస్ పర్సనల్ సెక్రటరీ చలాకీ సెరఫీనను పగలంతా కళ్లప్పగించి చూస్తూ వుంటాడు. అతను ఏ విషయం మాట్లడినా సహ ఉద్యోగులు పట్టించుకోరు. గొప్పవాళ్ళు చెత్తగా మాట్లాడినా మనుషులు ఆసక్తిగా వింటారు. తనలాంటివాళ్ళు ఎంత గొప్పగా మాట్లాడినా కొంచెమైనా ఆలకించరు అని నిత్యం మదనపడే అర్భకుడు అతను.

పనీపాటలేని పాపరజ్జీలు ఒకరోజు  సెలబ్రేటీలు ఎవరూ దొరక్క లియోపోల్డో వెనక పడతారు. దానితో అతను హఠాత్తుగా నగరంలో సెలెబ్రెటీ అయిపోతాడు. టెలివిజన్లు అతనితో లైవ్ షోలు నిర్వహిస్తాయి. నగరంలో జరిగే ప్రతి కార్యక్రమానికీ అతను ముఖ్యఅతిధిగా మారిపోతాడు. అతనే మరచిపోయిన ఇంటి పేరు కొత్తగా వచ్చి చేరుతుంది. అతను గడ్దం గీసుకోవడం దగ్గరి నుండి వేసుకునే అండర్ వేర్ వరకు అన్నింటి మీద టీవీల్లో  చర్చ జరుగుతూ వుంటుంది. అతను ఏం మాట్లాడినా అది జాతీయవార్త అయిపోతుంటుంది. చివరకు ఈరోజు వర్షం వస్తుందని అనుకుంటున్నారా? వంటి ప్రశ్నలు కూడా అతన్ని అడుగుతుంటారు. నిత్యం అతను చుట్టు ప్రముఖులు, పది మంది మీడియావాళ్ళు వుంటారు. 

లియోపోల్డో  గుమాస్తా నుండి ఆఫీసు మేనేజరు అవుతాడు. న్నాళ్ళూ తను కళ్ళు అప్పగించి చూసిన సెరఫీన తానుగా వచ్చి అతనితో సెక్స్ లో పాల్గొంటుంది.  ఫ్యాషన్ షోల్లో ర్యాంప్ మీద నడిచే మోడళ్ళు అతని మీద మనసు పారేసుకుంటుంటారు. ప్రముఖుడైపోయిన అతనితో మంచం పంచుకోవడానికి అమ్మాయిలు వరస కడతారు.  ప్రముఖులుగా వుంటే ఎన్ని ప్రయోజనాలు వుంటాయో, ఎన్ని సౌకర్యాలు వస్తాయో,  లియోపాల్డోకు తెలిసి వస్తుంది. దాన్ని అతను ఆస్వాదించడం మొదలు పెడతాడు.

సరిగ్గా ఆ సమయంలో పాపరజ్జీలు లియొపోల్డోను వదిలి ఇంకొకర్ని సెలబ్రెటీగా మారుస్తారు.  పాపరజ్జీల బెడద పోయినందుకు లియోపోల్డో మొదట్లో ఆనందపడతాడు. అయితే, జనం హఠాత్తుగా తనను పట్టించుకోవడం మానేయడంతో  అతను తీవ్ర మానసిక క్షోభకు గురవుతాడు. మతి చలించి రోడ్డు మీద పిచ్చిగా ప్రవర్తిస్తాడు.  అతని భార్య సముదాయించి ఇంటికి తీసుకుని వెళుతుంది. దారిలో ఒక డ్రైవరు లియొపోల్డో కు డబ్బే పరమార్ధమనే జీవిత సత్యం చెపుతాడు.
To Rome With Love (2012 )

          Characters & Cast  
        Grouped by storylines    
                  
          Group – 1           JERRY & GIANCARLO STORY

1       Hayley                 Michelangelo's fiancée (Alison Pill )
2       Michelangelo      Hayley's fiancé  (Flavio Parenti )
3       Jerry                    Hayley's Father (Woody  Allen)
4       Phyllis                  Hayley's mother and Jerry's wife (Judy Davis)
5       Giancarlo            Michelangelo's Father  (Fabio Armiliato)
6.      Mariangela                   Giancarlo’s wife

Group – 2  ANTONIO & MILLY Story 

7.      Antonio             Milly's husband (Alessandro Tiberi )
8.      Milly                    Antonio's wife (Alessandra Mastronardi )
9.      Anna                  A prostitute  (Penélope Cruz)
10.    Luca Salta         Cine Hero (Antonio Albanese)
11.    Hotel Thief         (Riccardo Scamarcio )
12.    Joan                   Antonio's aunt (Simona Caparrini)
13.    Pia Fusari          An actress (Ornella Muti)


Group – 3 JOHN & JACK Story

14      John,                  Successful architect and Jack's Adviser  
15     Jack                     Sally’s Boyfriend (Jesse Eisenberg)
16     Sally                              Jack's first girlfriend  (Greta  Gerwig)
17     Monica                Sally's best friend  (Ellen Page)
18     Leonardo            (Lino Guanciale
                  
          Group -  4           LEOPOLDO & ROBERT Story

19.    Leopoldo             Clerk and temporary celebrity (Roberto Benigni)             
20.    Sofia                    Leopoldo's wife  (Monica Nappo)
21.    Serafina              Personal Lady  secretary (Cecilia Capriotti)
22.    Marisa Raguso   Interviewer for Leopoldo  (Marta Zoffoli )
23     Robert                 Leopoldo's          Driver
24.    Paparazzis                   Paparazzis – TV Stringers

TO ROME WITH LOVE
SCENES AT – A – GLANCE  

To Rome With Love (2012)      Scenic Order &  Grouping                      
Scene  No.
Time Minutes
Scene Duration
General Scene Titles
JERRY & GIANCARLO Story
ANTONIO & MILLY Story
JOHN & JACK Story
LEOPOLDO & ROBERT Story
1
1.00
60
1. SONG ON ROME
1. SONG ON ROME
2
1.67
40
2. TRAFIC POLICE
2. TRAFIC POLICE
3
2.33
40
3. HAYLEY &  MICHELANGELO INTRODUCTION
3. HAYLEY &  MICHELANGELO INTRODUCTION
4
2.67
20
4. HAYLEY &  MICHELANGELO FRIENDS
4. HAYLEY &  MICHELANGELO FRIENDS
5
3.00
20
5. HAYLEY MESSAGE TO MOTHER
5. HAYLEY MESSAGE TO MOTHER
6
3.50
30
6. ANTONI  MILLY INTRODUCTION
6. ANTONI  MILLY INTRODUCTION
7
4.00
30
7. JOHN INTRODUCTION
7. JOHN INTRODUCTION
8
4.33
20
8. LEOPOLDO INTRODUCTION
8. LEOPOLDO INTRODUCTION
9
4.50
10
9. HAYLEY IN LOVE
9. HAYLEY IN LOVE
10
4.92
25
10. GIANCARLO INTRODUCTION
10. GIANCARLO INTRODUCTION
11
6.00
65
11. JERRY, PHYLLIS INTRODUCTION
11. JERRY, PHYLLIS INTRODUCTION
12
7.50
90
12. ANTONIO AND MILLY CHECK-IN
12. ANTONIO AND MILLY CHECK-IN
13
8.00
30
13. MILLY AT SALOON
13. MILLY AT SALOON
14
7.50
30
14. ROME NEVER CHANGE
14. ROME NEVER CHANGE
15
8.00
15. JACK INTRODUCTION
15. JACK INTRODUCTION
16
8.50
16. LEOPOLDO BREAK FAST
16. LEOPOLDO BREAK FAST
17
8.50
17. LEOPOLDO GOING TO OFFICE
17. LEOPOLDO GOING TO OFFICE
18
8.50
18. SERAFINA INTRODUCTION
18. SERAFINA INTRODUCTION
19
8.50
19. PAPARAZZI INTRODUCTION
19. PAPARAZZI INTRODUCTION
20
8.50
20. DESPERATE LEOPOLDO
20. DESPERATE LEOPOLDO
21
8.50
21. JERRY NO RETIREMENT 
21. JERRY NO RETIREMENT 
22
8.50
22. MICHELANGELO MET JERRY
22. MICHELANGELO MET JERRY
23
8.50
23. MILLY LOST IN ROME
23. MILLY LOST IN ROME
24
8.50
24. ANTONIO UNREST
24. ANTONIO UNREST
25
8.50
25. MILLY LOST CELL PHONE
25. MILLY LOST CELL PHONE
26
8.50
26. ANTONIO PHONE CALLS
26. ANTONIO PHONE CALLS
27
8.50
27.  JACK HOUSE
27.  JACK HOUSE
28
8.50
28. MILLI ON STREETS
28. MILLI ON STREETS
29
8.50
29. ANNA INTRODUCTION
29. ANNA INTRODUCTION
30
8.50
30. MONICA INTRODUCTION 
30. MONICA INTRODUCTION 
31
8.50
31. MONICA STARTED GAME
31. MONICA STARTED GAME
32
8.50
32. MONICA EROTIC 
32. MONICA EROTIC 
33
8.50
33. NIGHT WALK -  MONICA FLIRTS 
33. NIGHT WALK -  MONICA FLIRTS 
34
8.50
34. LEOPOLDO CELEBRITY
34. LEOPOLDO CELEBRITY
35
8.50
35. LEOPOLDO  LIVE TELECAST
35. LEOPOLDO  LIVE TELECAST
36
8.50
36. LEOPOLD  CELEBRETY HOUSE
36. LEOPOLD  CELEBRETY HOUSE
37
8.50
37. JERRY TO GIANCARLO HOUSE
37. JERRY TO GIANCARLO HOUSE
38
8.50
38. JERRY MEETS  GIANCARLO WIFE
38. JERRY MEETS  GIANCARLO WIFE
39
8.50
39. GIANCARLO WENT TO   BATH ROOM
39. GIANCARLO WENT TO   BATH ROOM
40
8.50
40. TWO FAMILIES MEET 
40. TWO FAMILIES MEET 
41
8.50
41. BATH ROOM SONG
41. BATH ROOM SONG
42
8.50
42. SINGER OFFER
42. SINGER OFFER
43
8.50
43. MILLY AT TRAFIC ISLAND
43. MILLY AT TRAFIC ISLAND
44
8.50
44. ANTONIO TOOK ANNA TO AUNT
44. ANTONIO TOOK ANNA TO AUNT
45
8.50
45. MILLY MET ACTRESS
45. MILLY MET ACTRESS
46
8.50
46. AUNT’S VATICAN TOUR
46. AUNT’S VATICAN TOUR
47
8.50
47. JACK COMPANY TO MONICA
47. JACK COMPANY TO MONICA
48
8.50
48. MONICA ATTRACTS JACK 
48. MONICA ATTRACTS JACK 
49
8.50
49. JACK PRAISES MONICA
49. JACK PRAISES MONICA
50
8.50
50.  LIOPOLDO GOT PROMOTION
50.  LIOPOLDO GOT PROMOTION
51
8.50
51. GIRL KISSES LEOPOLDO
51. GIRL KISSES LEOPOLDO
52
8.50
52. SOFIA NEW GOWN
52. SOFIA NEW GOWN
53
8.50
53. CINEMA  FUNCTION
53. CINEMA  FUNCTION
54
8.50
54. LEONARDO INTRODUCTION
54. LEONARDO INTRODUCTION
55
8.50
55.  JACK JEALOUS  WITH LEONARDO 
55.  JACK JEALOUS  WITH LEONARDO 
56
8.50
56.  JERRY ENCOURAGES GIANCARLO 
56.  JERRY ENCOURAGES GIANCARLO 
57
8.50
57. GIANCARLO AUDITION
57. GIANCARLO AUDITION
58
8.50
58. SO SORRY  JERRY
58. SO SORRY  JERRY
59
8.50
59. LUCA SALTA INTRODUCTION
59. LUCA SALTA INTRODUCTION
60
8.50
60. CROSS FLIRTING
60. CROSS FLIRTING
61
8.50
61. LEOPOLDO SHAVING
61. LEOPOLDO SHAVING
62
8.50
62. LEOPOLDO AT HAIRCUT SALOON
62. LEOPOLDO AT HAIRCUT SALOON
63
8.50
63. FASION AT SHOW
63. FASION AT SHOW
64
8.50
64. LEOPOLDO AT CEREMONIAL DINNER
64. LEOPOLDO AT CEREMONIAL DINNER
65
8.50
65. APHRODISIAC
65. APHRODISIAC
66
8.50
66. MONICA SHALLOW AND UNWORTHY OF LOVE
66. MONICA SHALLOW AND UNWORTHY OF LOVE
67
8.50
67.  RAIN CAVE ROMANCE
67.  RAIN CAVE ROMANCE
68
8.50
68. VERDI PROGRAMME SUCCESS
68. VERDI PROGRAMME SUCCESS
69
8.50
69. JERRY PAGLIACCI PROPOSAL
69. JERRY PAGLIACCI PROPOSAL
70
8.50
70. PARTY FOR THE ELITE OF ROME
70. PARTY FOR THE ELITE OF ROME
71
8.50
71. ANNA TAKES HER JOB
71. ANNA TAKES HER JOB
72
8.50
72. MONICA ENTRAP JACK
72. MONICA ENTRAP JACK
73
8.50
73. SUCCUMBS TO MONICA’S CHARMS.
73. SUCCUMBS TO MONICA’S CHARMS.
74
8.50
74. SEX IN CAR
74. SEX IN CAR
75
8.50
75. LEOPOLDO WITH COUSIN
75. LEOPOLDO WITH COUSIN
76
8.50
76. DRIVER ENLIGHTENING LEOPOLDO
76. DRIVER ENLIGHTENING LEOPOLDO
77
8.50
77. ANNA AFTER SEX
77. ANNA AFTER SEX
78
8.50
78. MILLY& LUCA AT HOTEL ROOM
78. MILLY& LUCA AT HOTEL ROOM
79
8.50
79. MONICA ROMANCE IN PARK
79. MONICA ROMANCE IN PARK
80
8.50
80. NEW CELEBRETY FOUND
80. NEW CELEBRETY FOUND
81
8.50
81. LIOPOLDO BACK TO HOME
81. LIOPOLDO BACK TO HOME
82
8.50
82. NEW OFFER TO MONICA
82. NEW OFFER TO MONICA
83
8.50
83. THE THIEF EPISODE
83. THE THIEF EPISODE
84
8.50
84. JACK REASSESSMENT
84. JACK REASSESSMENT
85
8.50
85. LEOPOLDO MAD & REALISATION
85. LEOPOLDO MAD & REALISATION
86
8.50
86. MILLY RETURNED
86. MILLY RETURNED
87
8.50
87. PAGLIACCI SHOW
87. PAGLIACCI SHOW
88
8.50
88. MEDIA REVIEWS
88. MEDIA REVIEWS
89
8.50
89 . SPANISH STEPS 
89 . SPANISH STEPS 
90
8.50
90. LAST NOTE
90. LAST NOTE
91
8.50
91.  END TITLES
91.  END TITLES














TO ROME WITH LOVE (2012)
SCREEN PLAY & Mood of the Scene
సన్నివేశాల వరసక్రమం – సున్నిత అంశాలు

1. SONG ON ROME
రోమ్ నగర పురాతన భవనాల మీదుగా కేమేరా ప్యాన్, టిల్ట్ అవుతూ వుంటుంది. అంతలో రోమ్ నగర సౌందర్యాన్ని చెప్పే పాట మొదలవుతుంది.
రోమ్ నగరమంటేనే ప్రేమమయం.
నేల మీద కాలు మోపితే ప్రేమ పుట్టుకు వస్తుంది.
గాలి పీలిస్తే మనసు ప్రేమతో నిండిపోతుంది.
ప్రపంచ ప్రేమికుల గమ్యస్థానం రోమ్.

 సున్నిత అంశం :
రోమ్ నగర శిల్పకళా సౌందర్యాన్నీ, అందులోని భావుకతనీ  ప్రదర్శించడం

2. TRAFIC POLICE
రోమ్ నగరంలో ఒక ట్రాఫిక్ ఐల్యాండ్,  ట్రాఫిక్ పోలీసు పాత్రల్ని పరిచయం చేస్తున్నాడు.
మన కథ 2012 లో మొదలయ్యింది.
సున్నిత అంశం :
ఒక భావావేశ వాతావరణంలో కాబోయే ప్రేమికుల్ని ప్రయోక్త పరిచయం చేస్తున్నాడు.

3. HAYLEY &  MICHELANGELO INTRODUCTION
హేలీ అందమైన అమెరికా అమ్మాయి. వృత్తిరీత్యా  ఆర్ట్  కలక్టర్.  కళా ఖండాలు చూడడానికి రోమ్ నగరానికి వచ్చింది. మైకెల్యాంజిలో మంచి ఫిజిక్ వున్న అచ్చమైన రోమ్ నగర యువకుడు.  వృత్తిరీత్యా లాయర్. ఇద్దరూ  ఒక హెరిటేజ్ భవనం దగ్గర కలిశారు.
సున్నిత అంశం :
తొలి పరిచయం ఇద్దరిలో పరస్పరం ఒఅక్ ఆకర్షణ కనిపించాలి.


4. HAYLEY &  MICHELANGELO FRIENDS
హేలీ, మైకెల్యాంజిలోల మధ్య పరిచయం స్నేహంగా మారుతోంది. తొలిరోజే వాళ్ల మధ్య ఒక ఆకర్షణ మొదలయింది. ఆ రాత్రి ఇద్దరూ  కలిసి రెస్టారెంటుకు డిన్నర్ కు వెళ్ళారు.
సున్నిత అంశం :
ఇద్దరి మధ్య ఆకర్షణ పెరుగుతోంది.


5. HAYLEY MESSAGE TO MOTHER
హేలీ సెల్ ఫోన్ లో తల్లితో మాట్లాడుతూ, రోమ్ వీధుల్లో నడుచుకుంటూ వెళుతోంది.  రోమ్ లో తనకు ఒక మంచి స్నేహితుడు కలిశాడని ఆనందంగా చెపుతోంది.

సున్నిత అంశం :
ప్రేమలో పడ్డ అమ్మాయిలో ఉండే ఉత్సాహం మెరుపు హేలీలోకనిపిస్తోంది.

6. ANTONI  MILLY INTRODUCTION
 రోమ్ రైల్వేస్టేషన్లో రైలు వచ్చి ఆగింది. ఆంటోనియో, మిల్లీ  ఇద్దరూ రైలు దిగారు. వాళ్లు కొత్త దంపతులు. ఒక చిన్న పట్టణం నుండి జీవనాధారం కోసం  ఎన్నో ఆశలుపెట్టుకుని రోమ్ నగరానికి వచ్చారు.  ఆంటోనియో కు దూరపు బంధువు ఒకామే రోమ్ నగరంలో ఐశ్వర్యవంతురాలు. ఆమె దయతో మంచి ఉద్యోగం సంపాదించి హాయిగా బతకాలని   ఆంటోనియో ఆశిస్తాడు.



సున్నిత అంశం :
వాళ్ళిద్దరూ కొత్త దంపతులు. చిన్న పట్టణం నుండి మొదటిసారి వచ్చిన వాళ్లకు రోమ్ మహానగరం కొత్తగానూ,వింతగానూ కనిపిస్తుంది. భర్తలో చిన్న గర్వం. భార్యలో ఒక ఆనందం కనిపించాలి.

7. JOHN INTRODUCTION
రాత్రిపూట ఒక రెస్టారెంట్ లో, భార్యతోపాటూ జాన్ డిన్నర్ చేస్తున్నాడు.  జాన్ అమెరికాలో ప్రఖ్యాత ఆర్కెటెక్ట్.  సతీ సమేతంగా రోమ్ నగర పర్యటనకు వచ్చాడు.  రోమ్ నగరమంటే అతనికి చాలా ఇష్టం.  పాతికేళ్ల క్రితం రోమ్ లో అతను చదువుకున్నాడు. అప్పట్లో ఒక ట్రైయాంగిల్ ప్రేమ కథ కూడా నడిపాడు. తనను ప్రేమించే నిరాడంబరమైన అమ్మాయిని కాకుండా  ఆకర్షణీయంగా వుండే అమ్మాయి వెంటపడి, ఎదురు దెబ్బలుతిన్న  అనుభవం అతనిది.
సున్నిత అంశం :
మిగిలినవాళ్ళు మొదటి సారి రోమ్ నగరానికి వచ్చిన వాళ్ళు. జాన్  రోమ్ నగరానికి పాత కాపు. ఆ విధంగా ఆ బృందానికి అతను ప్రస్తుతం  గైడ్.

8. LEOPOLDO INTRODUCTION
ఉదయం ఏడు గంటలకు  అలారం టైమ్ పీస్ మోగడంతో లియోపోల్డో, కళ్ళు తెరిచాడు. లియోపోల్డో, అతనూ, అతని భార్య సోఫియా భార్య బెడ్ మీద పడుకుని వున్నారు. లియోపోల్డో సగటు మధ్యతరగతి జీవి. అతను అశక్తుడు. అతనికి ఇంటి దగ్గరా గుర్తింపులేదు. ఆఫీసులోనూ గుర్తింపులేదు.  అతను జీవితాన్ని నడపలేడు  జీవితం అతన్ని నడుపుతుంది.

సున్నిత అంశం :
ప్రత్యేకత లేని చిన్న జీవితం. చిన్న కుటుంబం. అతనిలో నిర్వేదం కనిపించాలి.

9. HAYLEY IN LOVE
ఇంత త్వరగా ప్రేమలో పడతారని హేలీ మైకెల్యాంజిలో కూడా అనుకోలేదు.  ప్రేమికులిద్దరూ రోమ్ నగర వీధుల్లో ప్రేమాయణం సాగిస్తున్నారు. పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయానికి రావడంతో  హేలీని తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తానన్నాడు మైకెల్యాంజిలో.

సున్నిత అంశం :
ప్రేమికులు పూర్తిగా ప్రేమలో మునిగిపోయారు. పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

10. GIANCARLO INTRODUCTION
హేలీని తన ఇంటికి డిన్నర్ కు తీసుకు వెళ్ళాడు మైకెల్యాంజిలో.  అతని తండ్రి గయాన్ కార్లో అంతిమ యాత్రల నిర్వాహకుడు. ఎంతో కష్టపడి తన కోరికల్ని కూడా చంపుకుని పిల్లల్ని చదివించాడు.  మైకెల్యాంజిలో కుటుంబం హేలీకి బాగా నచ్చుతుంది.   హేలీ పేరెంట్స్ కు కబురు పెట్టాలి అన్నాడు గియాన్ కార్లో.

సున్నిత అంశం :
తల్లీ దండ్రులు పాతకాలంవాళ్ళు. పేదరికాన్ని అనుభవించి ఇప్పుడిప్పుడే ఆర్దికంగా నిలదొక్కుకుంటున్నారు. పిల్లలు బాగా చదువుకున్నారు. రెండు తరాల మధ్య అంతరం చాలా ఎక్కువ.

11. JERRY, PHYLLIS INTRODUCTION
హేలీ తండ్రి జెర్రి, తల్లి ఫెల్లిస్ విమానంలో అమెరికా నుండి రోమ్ కు బయలు దేరారు. జెర్రి గతంలో ఒపేరా దర్శకుడిiగా పనిచేశాడు. రిటైర్డ్ అయిపోయినా, అందరి కళ్ళు  చెదిరేలా సెకండ్  ఇన్నింగ్స్ ఒకటి ఆడాలనే తపనతో వున్న కళాకారుడాయన.  ఫెల్లిస్ విద్యావంతురాలైన గృహిణి. మైకెల్యాంజిలో  సంబంధం జెర్రీకి ఇష్టంలేదు.  ఫెల్లిస్ మాత్రం పెళ్ళి అనేది తమ కూతురి ఇష్టం అనుకుంటుంది.  ఆ కుర్రాడు కమ్యూనిస్టు అని అభ్యంతరం పెడతాడు. అసలు ఇటలీలో కమ్యూనిస్టు పార్టీయే లేదని ఫెల్లిస్ ఖండిస్తుంది. కమ్యూనిస్టులకు స్వంత ఆస్తి యావ వుండదని తెగ  బాధ పడిపోతాడు జెర్రి. తానైతే మంచి ధనవంతుల సంబంధం తేగలనంటాడు.
సున్నిత అంశం :
జరుగుతున్న పరిణామాల మీద జెర్రీలో అసహనం. జీవితంలో ఎదురయ్యే ప్రతిదాన్నీ స్వీకరించాలనే పరిపక్వత ఫిల్లీస్ లో  కనిపిస్తుంది.

12. ANTONIO AND MILLY CHECK-IN
లాడ్జి బాయ్ సామాన్లు తెచ్చి రూములో పెట్టాడు.  ఆంటోనియో, మిల్లీ గదిలో ప్రవేశించారు.  కొత్త దంపతుల కళ్లలో ఎన్నో ఆశలు. రోమ్ లో వున్న  తన బంధువులు  ఐశ్వర్య వంతులనీ, వాళ్లను ప్రసన్నం చేసుకుంటే తనకు ఏదైనా మంచి ఉద్యోగం ఇప్పిస్తారంటాడు ఆంటోనియో. అలా తాము రోమ్ లో స్థిరపడి ఆనందంగా గడపవచ్చంటాడు. భవిష్యత్తులో తమకు రోమ్ నగరంలో భవంతులు, వాహనాలు వుంటాయని కలల్లో మునిగిపోతారు. బంధువుల ముందు అందంగా కనిపించడానికి కాస్త మేకప్ వేసుకుంటానంటుంది మిల్లి. బ్యూటీ పార్లర్ ను వెతుక్కుంటూ ఆమె బయటికి వెళుతుంది. వెంటనే వచ్చేస్తానంటుంది.

సున్నిత అంశం :
నగరానికి వచ్చిన కొత్తలో సామాన్యులు కనే అమాయకపు కలలు ఆ దంపతుల్లో కనిపించాలి.

13. MILLY AT SALOON
మిలీ సెలూన్ కు వెళితే అక్కడ చాలా రద్దీగా వుంటుంది. ఇంకో సెలూనుకు వెళ్ళమంటాడు సెలూన్ మేనేజర్.  కొత్త సెలూన్ కూ ఎలా వెళ్ళాలో చెపుతాడు. మిలీకి ఆ దారి సరిగ్గా అర్ధం కాదు. ఆమె గందరగోళానికి గురవుతుంది.
సున్నిత అంశం :
సమస్య ప్రారంభం
14. ROME NEVER CHANGE
జాన్ తన భార్య మిత్రులతో భోజనం చేస్తున్నాడు. సైట్ సీయింగ్ కు వెళ్దామని మిత్రులు అంటారూ.  దారి తెలియదని ఒకరు అంటారు. మా ఆయనకు రోమ్ నగరం బాగా తెలుసు. ఆయన ఇక్కడే చదువుకున్నారు అంటుంది జాన్ భార్య. ఎప్పుడు ముఫ్ఫయి యేళ్ల క్రితం మాట. ఇప్పుడు రోమ్ నగరం పూర్తిగా మారిపోయింది అంటాడు జాన్. రోమ్ లాంటి నగరం ఎప్పటికీ మారదు అంటారు మిగిలినవాళ్ళు.

సున్నిత అంశం :
మనుషులు వస్తారు పోతారు. రోమ్ నగర్ మాత్రం మారదు.

15. JACK INTRODUCTION
జాన్ రోమ్ నగర వీధుల్లో నడుస్తున్నాడు. అప్పట్లో తనున్న ఇంటిని వెతికే పనిలో వున్నాడతను. జాక్ అనే యువ ఆర్కెటెక్ట్ జాన్ ను గుర్తు పట్టాడు. జాన్  ఫోటోను అతను ఎప్పుడో ఒక పత్రికలో చూశాడు. మీ ఇల్లు చూపెడతాను నడవండీ అంటూ జాన్ ను తీసుకు వెళ్ళాడు జాక్.
సున్నిత అంశం :
జాన్ సెలిబ్రెటీ. జాక్ అతనిలా ఎదగాలనుకుంటూన్న ఔత్సాహికుడు. జాక్ అంటే యువ జాన్. జాన్ అంటే ఎదిగిన జాక్.

16. LEOPOLDO BREAK FAST
లియోపోల్డో ఇల్లు. భార్య, ఇద్దరు కొడుకులతో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాడు. అతని భార్య సోఫియా వడ్డిస్తోంది. అతను సమయం బాగోలేదు. జీవితంలో గుర్తింపు లేదు. ప్రతిదానికీ లొంగిబతకాల్సిన జీవితం.
సున్నిత అంశం :
జీవితం ఇలాగే భారంగా ముగిసిపోతుందనే మధ్యతరగతి ఆందోళన  నిర్వేదం.

17. LEOPOLDO GOING TO OFFICE
లియోపోల్డో ఇంటి నుండి బయటికి వచ్చి కారులో ఆఫీసుకు బయలు దేరాడు. వీధిలో అతన్ని ఎవరూ పలకరించరు. పట్టించుకోరు. గుర్తింపులేని జీవితం అతనిది.
సున్నిత అంశం :
ఈ భూమ్మీద మనల్ని ఒక్కడూ పలకరించనపుడు కలిగే నిస్సహాయపు ఆవేదన. 


18. SERAFINA INTRODUCTION
లియోపోల్డో ఆఫీసుకు చేరుకున్నాడు. ఆఫీసులో అతను ఆటలో బుడంకాయ వంటివాడు. అఫీస్ సెక్రటరీ సెరాఫినా హొయలు పోతూవుంటుంది. అందమైనది, తెలివైనది. బాస్ కు అతి దగ్గరైనది. ఆమెను అందరూ కళ్ళు అప్పగించి చూస్తుంటారు.

సున్నిత అంశం :
డబ్బూకూ, అందాల్ని విరబూసే అమ్మాయిలకూ ఒక అనుబంధం వుంటుంది.

19. PAPARAZZI INTRODUCTION
గొప్పవాళ్ళు చెత్త విషయాలు మాట్లాడినా జనం వింటారు. అర్భకులు గొప్ప విషయాలు మాట్లాడినా జనం వినరు. లియోపోల్డో పరిస్థితీ అంతే.  లియోపోల్డో మిత్రులతో కలిసి సినిమాకు వెళ్ళాడు. సినిమా హాలు నుండి బయటికి వస్తుంటే అక్కడ పాపరజ్జీలు ఒక సుప్రసిధ్ధ నటిని చుట్టుముడుతుంటారు.  ఆ సన్నివేశాన్ని లియోపోల్డో చాలా ఆసక్తిగా చూస్తాడు. ఒక్కరోజైనా అలాంటి సెలబ్రెటీ కావాలనేది లియోపోల్డో చిరకాల కోరిక. ఆస్కార్ ఓటింగ్ లో పాల్గోవడానికి తనకు అవకాశం వస్తే ఎవరికి ఓటు వేస్తాడో, ఫ్యాషన్ షోకు జడ్జీగా పిలిస్తే ఎవరిని మిస్ యూనివర్శ్ గా ఎంపిక చేస్తాడో   స్నేహితులకు చెపుతుంటాడు  లియోపోల్డో,


సున్నిత అంశం :
చిన్నవాళ్ళు తమ కోరికల్ని తమలోనే దాచుకోవాలి. వాటిని బయటికి చెప్పేస్తే నవ్వులపాలు అవుతారు.


20. DESPERATE LEOPOLDO
లియోపోల్డో, సోఫియా బెడ్ మీద పడుకుని టీవీ చూస్తున్నారు.  వచ్చే వారం ప్రసారమయ్యే సెలబ్రెటీల గురించి టీవీలో  ప్రోమో లు వస్తుంటాయి.. అలా ఒక్కసారైనా తన పేరు  టీవీల్లో వస్తుందా? అని లియోపోల్డో ఆలోచిస్తుంటాడు.

సున్నిత అంశం :
టివీలో సెలబ్రేటీల కార్యక్రమాల్ని భార్య కళ్ళు అప్పగించి చూస్తుంటే తనుకూడా ఒకసారి అలా టీవీలో కనిపించాలని ప్రతి భర్తకూ అనిపిస్తుంది.

21. JERRY NO RETIREMENT 
హొటల్  లాన్ లో జేర్రీ, ఫిల్లీస్ చర్చించుకుంటున్నారు. రిటైర్ మెంట్ అనేది తనకు నచ్చదు అంటున్నాడు జెర్రీ. మనిషి జీవించినంతకాలం ఎదో ఒకటి చేస్తూ వుండాలని వాదిస్తాడు. భార్య దాన్ని  అంతగా పట్టించుకోదు. తన ఐక్యూ ఇంకా బాగుందని అంటాడు.

సున్నిత అంశం :
రిటైర్ మెంటును అంగీకరించని భర్త. వాస్తవాన్ని అంగీకరించమని చెప్పే భార్య.


22. MICHELANGELO MET JERRY
జేర్రీ, ఫిల్లీస్ బస చేసిన హొటలుకు హేలీ, మైకెల్యాంజిలో వచ్చారు. క్రిస్మస్ నెలలో పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెపుతారు.  అందరూ డ్రింక్ కు సిధ్ధం అవుతారు. జేర్రీ తాను ఒపేరా డైరెక్టరుగా పనిచేశానంటాడు. మికెల్యంజిలో తాత వెర్డి (రోమన్ సాంప్రదాయ సంగీతం) కళాకారుడని హేలీ చెపుతుంది. యూనియన్ గొడవలవల్ల ఒపేరా హౌస్ మూతపడిందని జెర్రీ చెపుతాడు. తాను కార్మికుల పక్షమే అంటాడు మికెల్యాంజిలో.
సున్నిత అంశం :
కాబోయే అల్లుడు కమ్యూనిస్టు.  కాబోయే మామ కమ్యూనిస్టు వ్యతిరేకి.

23. MILLY LOST IN ROME
మిల్లీ రోమ్ నగర వీధుల్లో తప్పిపోయి ఎక్కడెక్కడో తిరుగుతోంది.  కనిపించినవాళ్లను అడ్రస్ అడుగుతోంది.

సున్నిత అంశం :
జాగ్రత్తలు తీసుకోనివాళ్ళు ఇబ్బందుల్ని కొనితెచ్చుకుంటారు.

24. ANTONIO UNREST
అటు హొటల్ గదిలో ఆంటనియో భార్య కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. సెల్ ఫోన్ తీసి కీస్ నొక్కాడు.
సున్నిత అంశం :
అర్భకుని ఆశనిరాశలు.

25. MILLY LOST CELL PHONE
మిల్లీ రోమ్ నగర వీధుల్లో కనిపించినవాళ్లను అడ్రస్ అడుగుతోంది. అంతటి రోమ్ నగరంలో అడ్రస్ పట్టుకోవడం సులువుకాదని ఆమెకు అర్ధం అయింది. దిక్కుతోచక దిక్కులు చూస్తోంది. అంతలో సెల్ ఫోన్ మోగింది. కంగారుగా హ్యాండ్ బ్యాగ్ నుండి సెల్ ఫోన్ సెట్ తీసింది. కానీ, కంగారులో సెల్ ఫోన్ చేతిలో నుండి జారి మ్యాన్ హోల్ గ్రిల్ నుండి డ్రైనేజీలో పడిపోయింది.
సున్నిత అంశం :
కష్టాలన్నీ కలిసే వస్తాయి.
26. ANTONIO PHONE CALLS
అటు హొటల్ గదిలో ఆంటోనియో సెల్ ఫోన్  ను పదేపదే డయల్ చేస్తున్నాడు.
సున్నిత అంశం :
అర్భకుని ఆశనిరాశలు.

27.  JACK HOUSE
జాన్ ను జాక్ తన ఇంటికి తీసుకువచ్చాడు. తను ఒకప్పుడు ఆ ఇంట్లోనే వాడ్నని జాన్ గుర్తించాడు. జాక్ తన గర్ల్ ఫ్రెండ్ శాలీని జాన్ కు పరిచయం చేశాడు. శాలీ  రోమ్ లో చదువుకుంటోంది. తన ఫ్రెండ్ మోనిక వస్తున్నదని శాలీ చెపుతోంది.  మోనికా తన బాయ్ ఫ్రెండ్ డోనాల్డ్ తో విడిపోయిందనీ, ఆమె ఇప్పుడు ఒక రకం నైరాశ్యంలో వుందని చెపుతుంది. ఆ ఇంట్లోకి మోనిక వస్తే ఏం జరగబోతుందో జాన్ ను అప్పుడే అర్ధం అయిపోతుంది. (అతనికి యవ్వనంలో అలాంటి అనుభవమే ఎదురయ్యింది)

సున్నిత అంశం :
మనం చేసిన తప్పునే మన ముందున్నోడు చేస్తున్నపుడు ఆమోదించడానికి అనుభవ అడ్డుపడుతుంది. అడ్డుపడ్డానికి నైతిక ధైర్యం సరిపోదు.

28. MILLI ON STREETS
రోమ్ నగర వీధుల్లో మిల్లీ అమాయికంగా దిక్కుతోచక తిరుగుతోంది.
సున్నిత అంశం :
మహానగరంలో  దారితప్పిన వనిత.

29. ANNA INTRODUCTION
హొటల్ గదిలో ఆంటోనియో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. తలుపు తట్టిన చప్పుడయితే ఆనందంగా వెళ్ళి డోర్ తీశాడు. కమ్మర్షియల్ సెక్స్ వర్కర్ అన్నా లోపలికి వచ్చింది. నన్ను నీకు సమర్పించుకోవడానికి వచ్చాను. నా బిల్లు కూడా నాకు చేరిపోయింది అంది. ఆమే పొరపాటుగా తన గదికి వచ్చేసిందని చెప్పి అన్నాను  పంపించేయడానికి ఆంటోనియో ప్రయత్నిస్తాడు. ఈ పెనుగులాటలో వాళ్ళిద్దరూ ఒక శృంగార భంగిమలో వుండగా  ఆంటోనియో బంధువులు గదిలోనికి ప్రవేశిస్తారు. అన్నాను వాళ్ళు మిలీ అనుకుంటారు.  ఆంటోనియో అవుననలేడు. కాదన లేడు. బట్టలేసుకుని కిందికి రమ్మని వెళ్ళిపోతారు బంధువులు. తన భార్యగా నటించమని అన్నాను ప్రాధేయపడతాడు ఆంటోనియో.

సున్నిత అంశం :
చాలాసార్లు  అవకాశాలు, యాధృచ్చికతలే జీవితాన్ని నడుపుతుంటాయి.


30. MONICA INTRODUCTION 
మోనికను రిసీవ్ చేసుకోవడానికి శాలీ, జాక్, జాన్ ఎయిర్ పోర్టుకు వెళతారు. మగవాళ్లను ఇట్టే ఆకర్షించే గ్లామర్ మోనికది. జాక్ మోనిక ఆకర్షణలో పడతాడని జాన్ హెచ్చరిస్తాడు.
సున్నిత అంశం :
జాక్ జీవితంలోనికి ఒక ఆకర్షణీయమైన  ప్రమాదం ముంచుకు వస్తోంది.

31. MONICA STARTED GAME
శాలీ, మోనిక,  జాక్, జాన్ కారులో ఇంటికి వస్తున్నారు. మొత్తానికి జాక్ ను  మోనిక ఆకర్షిస్తోంది అంటాడు జాన్. తనకు అలాంటి ఆసక్తిలేదు అంటాడు జాక్.

సున్నిత అంశం :
ఆకర్షించాలి, ఆకర్షింపబడాలి అనేది మోనికా నైజం.




32. MONICA EROTIC 
తన బాయ్ ఫ్రెండ్ డోనాల్డ్ స్వలింగ సంపర్కుడని మోనిక అంటుంది. ఆడదాని పొందులో వున్న ఆనందాన్ని అతనికి రుచి చూపించినా అతని అభిరుచి మారలేదు అంటుంది. తనను ఒక లేడీ మోడల్ డ్రెస్సింగ్ రూముకు పిలిచి గట్టిగా కౌగలించుకుని ముద్దు పెట్టుకుంది అని ఇంకో కథ చెపుతుంది. తామంతా సరదాగా బయటికి పోదాం అంటుంది. జాన్ ప్రమాదాన్ని శంకిస్తాడు. శాలీని కూడా వాళ్ళతో పాటూ  వెళ్ళమంటాడు. మోనిక మీద జాక్ కు ఆసక్తి కలుగుతుంది.

సున్నిత అంశం :
ఎదురుగావున్న వాళ్ళను  సెక్స్ కు ప్రేరేపించడానికి ఒక ఎత్తుగడగా  కొందరు తమ సెక్స్ అనుభవాల్ని పూసగుచ్చినట్టు చెపుతారు.

33. NIGHT WALK -  MONICA FLIRTS 
శాలీ, మోనిక, జాక్ రాత్రిపూట వ్యాహాళికి వెళ్ళారు. మోనిక క్రమంగా జాక్ ను కవ్విస్తూ  వుంటుంది.

సున్నిత అంశం :
ఒకసారి అబ్బాయిల్లో సెక్స్ కోరికను పుట్టించాక వాళ్ళను తోకలా వెంట తిప్పుకోవడం అమ్మాయిలకు చాలా సులువు.  


34. LEOPOLDO CELEBRITY
ఎప్పటిలానే లియోపోల్డో టైమ్  ప్రకారం లేచాడు. టైమ్ ప్రకారం టిఫిన్ చేశాడు. టైమ్ ప్రకారం ఆఫీసుకు బయలుదేరాడు. అతను కారును సమీపిస్తుంటే పాపరజ్జీలు చుట్టుముట్టారు. లియోపోల్డో కంగారుపడి ఇంట్లోనికి పరుగెత్తాడు. పాపరజ్జీలు అతన్ని వెంటాడారు. బలవంతంగా అతన్ని కారులో వేసుకుని  టీవీ స్టూడియోకు టీసుకుపోతారు.

సున్నిత అంశం :
అనుకోని అదృష్టం.

35. LEOPOLDO  LIVE TELECAST
లియోపోల్డో ను టీవీ స్టూడియోకు తీసుకువెళ్ళి టచప్ చేసి, లైవ్ ప్రోగ్రాంలో కూర్చోబెడతారు. తనను అక్కడికి ఎందుకు తీసుకువచ్చారో లియోపోల్డోకు అర్ధం కాదు.  మా ప్రశ్నలకు జవాబు ఇచ్చేవాడు ఒకడు కావాలి అంటుంది యాంకర్. బ్రేక్ ఫాస్ట్ లో మీకు ఏది ఇష్గ్టం? ఎందుకు ఇష్టం? మీరు గెడ్డం గీసుకుని బ్రేక్ ఫాస్ట్  చేస్తారా? లేకపోతే బ్రేక్ ఫాస్ట్  చేసి గెడ్డం గీసుకుంటారా? వంటి ప్రశ్నలు వేస్తుంది. లైవ్ పొగ్రాం అయ్యాక టివీ స్టాఫ్, యాజమాన్యం  లియోపోల్డో ను అభినందిస్తారు.

సున్నిత అంశం :
మనుషులు డబ్బును ప్రేమిస్తారు. డబ్బున్నోళ్ళ వంకర ముక్కు కూడా అందంగా కనిపిస్తుంది.

36. LEOPOLD CELEBRETY HOUSE
లియోపోల్డో ఇంటికి రాగానే పాపరజ్జీలు మళ్ళీ వెంటాడుతారు. ఇంట్లో ఫోన్ ఆగకుండా మోగుతోంది అంటుంది భార్య సోఫియా. లైవ్ షోలకు రమ్మని టీవీల వాళ్ళు ఆహ్వానిస్తున్నారు అంటుంది. మీరు ఇప్పుడు సెలెబ్రిటీ అయిపోయారు అని భార్య అంటుందిగానీ ఎలా అయ్యాడో వాళ్లకే ఆర్ధంకాదు.
సున్నిత అంశం :
సెలెబ్రెటీ అంటే అతని ఫోన్ ఆగకుండా మోగుతూ వుండాలి. అతను నడుస్తుంటే జనం అతని గురించి మాట్లాడుకోవాలి. అతన్ని చూడాలని ప్రజలు తహతహలాడాలి.


37. JERRY TO GIANCARLO HOUSE
జెర్రీ, ఫిలిస్ వీధిలో మికెల్యాంజిలో ఇల్లు వెతుకుతుంటారు. గియాన్ కార్లోకు ఫునెరల్ పార్లర్ వుందని, దాని మీద మళ్ళీ గొడవ చేయవద్దని భర్తకు ముందే హెచరిస్తుంది జెర్రి. కొడుకు కమ్యూనిస్టు. తండ్రి శవపేటికల వ్యాపారి. మరి తల్లి కుష్టురోగుల హోం నడుపుతుందేమో అని చికాకు పడతాడు జెర్రి. గియాన్ కార్లో వాళ్ళిద్దరికీ స్వాగతం పలుకుతాడు. అతనితో చేయికలపడానికి జెర్రి ఇబ్బంది పడతాడు.

సున్నిత అంశం :
వున్నవాళ్ళు  లేనివాళ్ళను సాంస్కృతికంగా, నైతికంగా అవమానిస్తారు.

38. JERRY AND GIANCARLO WIFE
ఇంట్లోకి తీసుకెళ్ళి తన భార్యకు పరిచేయంచేస్తాడు గియాన్ కార్లో. తను స్నానం చేసి వస్తానంటాడు.
సున్నిత అంశం :
వున్నవాళ్ళు ఇంటికి వచ్చినపుడు పేదవాళ్ళు చాలా వినయంగా వ్యవహరిస్తారు.

39. GIANCARLO WENT TO   BATH ROOM
గియాన్ కార్లో బాత్ రూములోనికి ప్రవేశిస్తాడు.
సున్నిత అంశం :
కథ మలుపు తిరగడానికి ఆరంభం.

40. TWO FAMILIES MEET 
జెర్రి,  ఫిల్లిస్, గియాన్ కార్లో.భార్యతో మాట్లాడుతుంటే హేలీ, మికెల్యాంజిలో వస్తారు.
సున్నిత అంశం :
కథ మలుపు తిరగడానికి మరో అడుగు.
41. BATH ROOM SONG
గియాన్ కార్లో బాత్ రూమ్ లో స్నానం చేస్తూ  వెర్డీ పాట పాడుతుంటాడు. ఆ పాట కు జెర్రీ మైమరిచిపోతాడు. బాత్ రూమ్ డోర్ దగ్గర నిలబడి పాటంతా వింటాడు. అతనికి గియాన్ కార్లో మీద వున్న దురభిప్రాయం పోతుంది.
సున్నిత అంశం :
కథ మలుపు తిరిగింది. 

42. SINGER OFFER
రాత్రి భోజనాల దగ్గర వెర్డీ సంగీతంలో  గియాన్ కార్లో నైపుణ్యాన్ని జెర్రి పొగుడుతాడు. గాత్ర కచేరీ ఏర్పాటు చేస్తానంటాడు. తానేదో బాత్ రూమ్ సింగర్నేతప్ప ప్రదర్శన ఇచేంత సాహసం తనకు లేదంటాడు గియాన్ కార్లో. అయినా జెర్రీ వదలడు.  గియాన్ కార్లో లో ఒక గొప్ప కళాకారుడున్నాడనీ అతన్ని ప్రపంచానికి తానే పరిచయంచేస్తానన్నీ అంటాడు.

సున్నిత అంశం :
అప్పటి వరకు అవమానించిన గియాన్ కార్లోను బతిమాలతున్నాడు జెర్రీ.

43. MILLY AT TRAFIC ISLAND
మిల్లి రోడ్ల మీద వెర్రిగా తిరుగుతోంది. తాము దిగిన హోటల్ పేరు కూడా ఆమెకు గుర్తులేదు. ఏం చేయాలో తోచక ట్రాఫిక్ లొ ఫౌంటెన్ దగ్గర కూర్చుండిపోయింది.
సున్నిత అంశం :
దిక్కుతోచని స్థితి.

44. ANTONIO TOOK ANNA TO AUNT
అన్నాను తీసుకుని బంధువుల ఇంటికి  భోజనానికి వెళ్ళాడు ఆంటోనియో. అన్నా డ్రెస్సు చూసి అతను బంధువులు నొచ్చుకున్నారు. ట్రైన్ లో తమ బట్టల  సూట్ కేసి పోయిందని సర్దిచెప్పాడు ఆంటోనియో.

సున్నిత అంశం :
అన్ని విధాలా మనదికాని జీవితం.

45. MILLY MET ACTRESS
దారి తప్పిన మిలి ఒక సినిమా షూటింగ్ స్పాట్ కు వెళ్ళింది. అక్కడ తన అభిమాన నటిని చూసి మైమరచిపోయింది. అక్కడ తన అభిమాన నటుడు  లూకా కూడా వున్నాడని తెలిసి ఉబ్బితబ్బిబ్బు అయిపోయుంది.
సున్నిత అంశం :
మిలి కథ మలుపు తిరుగుతోంది.

46. AUNT’S VATICAN TOUR
ఆంటోనియో బంధువులు ఆ హాలులో పెయింటింగ్స్ ను, శిల్పాలనూ చూస్తున్నారు.
సున్నిత అంశం :
అలవాటులేని  వాతావరణం

47. JACK COMPANY TO MONICA
శాలి కాలేజీకి వెళుతోంది. మోనికకు  కాలక్షేపం కోపం బయటికి తీసుకునివెళ్లమని జాక్ కు చెప్పింది. తనకు అంత సమయం లేదన్నడు జాక్. తనకోసం మోనికను బయటికి తీసుకెళ్ళమంది శాలీ.
సున్నిత అంశం :
కోరి కష్టాలు తెచుకోవడం.

48. MONICA ATTRACTS JACK 
మోనికతో  సైట్ సీయింగ్ కు వెళతాడు జాక్. అర్క్ టెక్చర్, సాహిత్యం, కవిత్వం, సినిమాలు, సెక్స్ ఒకటేమిటీ ప్రపంచంలోవున్న అన్ని విషయాల గురించి అలవోకగా మాట్లాడేస్తుంటుంది మోనిక. ఆమె విజ్ఞానానికి   తెగ ఆకర్షితుడైపోతాడు జాక్ కు ఆమె విజ్ఞానఖని అనిపిస్తుంది. అదంతా చెత్త. మిడిమిడి జ్ఞానం మాత్రమే అని హెచ్చరిస్తాడు  జాన్. అమె చాలా గొప్పది అంటాడు జాక్. ఇక తగలెడు అంటాడు జాన్.

సున్నిత అంశం :
వ్యామోహంలో వున్నవాళ్ళని బోల్తా కొట్టించడం చాలా సులువు.

49. JACK PRAISES MONICA
శాలీ, జాక్ పర్చేజింగ్ కు వచ్చారు. శాలీ దగ్గర్ మోనికను పొగుడుతాడు జాక్. మోనికాకు ఒక జొడీని వెతకాలి అని అంటుంది శాలీ. వాళ్ల  స్నేహితుల్లో లియోనార్డో మంచి జోడి అవుతాడు అంటుంది శాలీ. లీయోనార్డో కూడా కొంతకాలం ఒక సినీనటితో సరసం నడిపాడు. ప్రస్తుతం వాళ్ళు విడిపోయారు అంటుంది శాలీ.

సున్నిత అంశం :
గంతకుతగ్గ బొంత.

50.  LIOPOLDO GOT PROMOTION
లియోపోల్డోకు ప్రమోషన్ వస్తుంది. అతనికి కొత్త ఛాంబరు కేటాయిస్తాడు బాస్. లియోపోల్డోకు సహాయకురాలిగా సెరాఫినాను నియమిస్తాడు. రాత్రిపగలు లియోపోల్డోకు ఎలాంటి సేవలు కావాలన్నా అందిస్తాను అంటుంది సెరాఫినా.
సున్నిత అంశం :
కాలం కలిసివస్తే కోరుకున్న అమ్మాయి వచ్చి కౌగిలించుకుంటుంది.


51. GIRL KISSES LEOPOLDO
ఆఫీసు నుండి బయటికి రాగానే  లియోపోల్డోను పాపరజ్జీలు చుట్టు ముడతారు. ఆరోజు విశేషం ఏమిటీ? అని అడుగుతారు. బల్ల మీద ఇంకు ఒలికింది. అయితే మొత్తం ఇంకు ఒలకకుండా జాగ్రత్త పడ్డాను అంటాడు.  అదో పెద్ద వార్త అయుతుంది. దాని మీద ఛానళ్ళలో చర్చ మొదలవుతుంది. ఒకమ్మాయి వచ్చి అందరి ముందు లియోపోల్డోను ముద్దు పెట్టుకుంటుంది.

సున్నిత అంశం :
డబ్బు అంటే ముద్దు. డబ్బున్నోళ్లన్నా ముద్దు.

52. SOFIA NEW GOWN
సోఫియా కొత్త గౌనును భర్తకు చూపెడుతుంది. తనకు తల నెప్పిగావుంది బయటకు రాలేను అంటాడు లియోపోల్డో. సభలు, సమావేశాలకు వెళ్లక పోతే సెలబ్రెటీలుగా గుర్తింపు పోతుంది అంటుంది భార్య.
సున్నిత అంశం :
సెలిబ్రెటీ అన్నది ఒక వ్యామోహం.

53. CINEMA  FUNCTION
సినిమా ఫంక్షన్ జరుగుతూ వుంటుంది. నటులు వరసగా వస్తూ వుంటారు.  లియోపోల్డో., సోఫియా కుడా అక్కడికి చేరుకుంటారు. ఒక హీరోయిన్ వచ్చి  లియోపోల్డోను నిజ జీవిత హీరోగా పొగుడుతుంది. సినిమా హీరోలకన్నా గొప్పవాళ్ళు అంటుంది.  తన ఫోన్ నెంబరు ఇస్తుంది. ఈలోపులో పేజ్ –త్రీ రిపోర్టరు వచ్చి  మీరు బ్రీఫ్స్ వాడుతారా? బాక్సర్స్ వాడుతారా? అని అడుగుతుంది.
సున్నిత అంశం :
గొప్పవాళ్ళు చేసే ప్రతిపనీ గొప్పే.

54. LEONARDO INTRODUCTION
మోనికా, లియోనార్డో ఒకరికొకరు దగ్గరవుతున్నారు. వాళ్ళు అలా దగ్గరకావడం జాక్ కు ఇబ్బందిగా వుంది. జాన్ హఠాత్తుగా దర్శనమిచ్చి అసూయగా వుంది కదూ అని అడుగుతాడు. అవునంటాడు జాక్. మోనిక తనకు కావాలంటాడు. ఆమె అంటే ఇష్టం కలుగుతున్నదంటాడు.
సున్నిత అంశం :
ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక ప్రొవకేషన్ కావాలి.

55.  JACK JEALOUS  WITH LEONARDO 
లియోనార్డో జాక్ ఇద్దరూ  మార్నింగ్ వాక్ తరువాత ఒక టీ క్యాంటీన్ కు చేరుకున్నారు. మోనికను ఇష్టపడుతున్నానంటాడు లియోనార్డొ. అమెతో ఒంటరిగా గడపాలనుందంటాడు. జాక్ ఖిన్నుడవుతాడు.
సున్నిత అంశం :
పెరుగుతున్న అసూయ.

56.  JERRY ENCOURAGES GIANCARLO 
గియాన్ కార్లో వెంటపడతాడు జెర్రి. తను చోరవ చేసి, తన మిత్రుల ద్వార ఆడిషన్  ఏర్పాటు చేశానంటాడు. తనకు ఏమాత్రం ఇష్టం లేదంటాడు గియాన్ కార్లో. ఎంతకాలం ఇలా శవాలతో గదుపుతావూ, సజీవులైన మనుషులకు కూడా కాస్త వినోదాన్ని పంచు. నీలో గొప్ప పగ్లియాచ్చి కళాకారుడు వున్నాడు అంటాడు. పగ్లియాచ్చి సంగీత ప్రదర్శన ఇవ్వాలనేది తన చిరకాల వాంఛ అంటాడు గియాన్ కార్లో. తను దర్శకత్వం వహించి ఒక పెద్ద పగ్లియాచ్చి ప్రదర్శన ఏర్పటు చేస్తానంటాడు జెర్రి.

సున్నిత అంశం :
జెర్రీలో కొత్త ఆశ. గియాన్ కార్లోలో కొరవడిన ఆత్మవిశ్వాసం

57. GIANCARLO AUDITION
జెర్రీ మాటను కాదనలేక గియాన్ కార్లో ఆడిషన్ ఇస్తాడు. అయితే అతను అందర్నీ నిరాశపరుస్తాడు.
సున్నిత అంశం :
ఒక పరాజయం

58. SO SORRY  JERRY
అందర్ని నిరాశపరచినందుకు గియాన్ కార్లో సారీ చెపుతాడు. అనవసరంగా తన తండ్రిని ఇబ్బంది పెట్టారని మికెల్యాంజిలోకు చిరాకు వస్తుంది. పరాజయం ఎదురైందని ప్రయత్నమే మానేయకూడదు అంటాడు జెర్రి. అత్తామామ, కూతురు అల్లుడు, వియ్యపురాలు చర్చించుకుంటుండగానే బాత్ రోమ్ లో  గియాన్ కార్లో అద్భుతంగా పాడుతుంటాడు. బాత్ రూమ్ లో ఎవరైనా బాగా పాడుతారు అంటుంది ఫిల్లీస్. దానితో జెర్రీకి ఒక కొత్త ఆలోచన వస్తుంది.

సున్నిత అంశం :
పరాజయం మానవ సంబంధాలను దెబ్బతీస్తుంది. కానీ, కొత్త విజయానికి బాటలేస్తుంది.

59. LUCA SALTA INTRODUCTION
మిలీని హీరో లూకా సాల్టా కు పరిచయం చేసింది హీరోయిన్. మీ సినిమాలు ఒక్కటీ మిస్ కాకుండా చూస్తాను. మిమ్మల్ని తెర మీద చూసి మైమరచిపోతాను. జీవితంలో మిమ్మల్ని ఒక్కసారయినా చూడాలని కలలుకంటుంటాను అంటుంది మిలీ.  ఈ మూడు మాటలూ అనేస్తే ఆ అమ్మయిని పడగ్గదికి తీసుకుపోవడానికి మూడొంతుల పని అయిపోయినట్టేనని హీరో అనుకుంటాడు.  తనతోపాటు లంచ్ కు రమ్మంటాడు. తన్మయంతో అతని వెంట వెళుతుంది మిలీ. 

సున్నిత అంశం :
మిల్లీ జీవితంలో కొత్త మలుపు

60. CROSS FLIRTING
ఆంటనియో, అన్నాలను బంధువులు లంచ్ కు తీసుకు వెళతారు. సామాజిక వడబోత గురించి బొత్తిగా తెలియని అన్న కుటుంబ వ్యవస్థ గురించి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆంటోనియో బంధువులు అవాక్కు అయిపోతారు. ఈలోపు మిల్లీని తీసుకుని అదే హోటలుకు వస్తాడు హీరో లుకా. మిలి ఆంటనియోను చూడదుగానీ ఆంటానియో ఆమెను చూస్తాడు. మిలీని హీరో నెమ్మదిగా తన వశం చేసుకుంటుంటాడు. ఇదంతా ఆంటానియో గమనిస్తూ వుంటాడు. అన్నాకు కూడా పరిస్థితి అర్ధం అవుతుంది. తనకు పెళ్లయినా భార్యతో సంబంధాలు లేవంటాడు హీరో. మిల్లీని సాయంత్రం స్టూడియోకూ, రాత్రి హొటలుకు రమ్మంటాడు లూక. వాళ్ల మాటలు విని ఆంటానియో షాక్ అవుతాడు.
సున్నిత అంశం :
విధిచేతుల్లో కీలుబొమ్మలు.

61. LEOPOLDO SHAVING
లియోపార్డో గెడ్డం గీసుకుంటుంటాడు. టీవీ వాళ్ళు వచ్చి అతను గడ్దం ఎలా గీసుకుంటాడో లైవ్ ప్రోగ్రాం ఇస్తారు.
సున్నిత అంశం :
డబ్బున్నోడి కుటీకాలు కూడా అందంగా వుంటుంది.

62. LEOPOLDO AT HAIRCUT SALOON
లియోపార్డో హెయిర్ సెలూన్ కు వెళతాడు.  అక్కడా అతని హెయిర్ స్టైల్ పై లైవ్ టెలికాస్ట్ ఇస్తారు టీవీల వాళ్ళు.

సున్నిత అంశం :
బ్బున్నోడి బట్టతల కూడా అందంగా వుంటుంది.

63. FASION AT SHOW
లియోపార్డో ఫ్యాషన్ షోకు వెళతాడు. ర్యాంప్ మీద నడిచే మోడల్స్  మనసు పారేసుకున్నట్టు లియోపార్డోనే చూస్తుంటారు.
సున్నిత అంశం :
డబ్బు, అమ్మాయిలు కలిసేవస్తారు.

64. LEOPOLDO AT CEREMONIAL DINNER
సెరఫీనను తీసుకుని లియోపార్డో  హొటల్ కు వెళతాడు. అక్కడ అప్పటికే టేబుల్స్ ఫుల్ అయిపోతాయి, అయితే, లియోపార్డో ను చూసి గుర్తు పట్టిన మేనేజర్ అతన్ని సాదరంగా లోపలికి ఆహ్వానిస్తాడు.
సున్నిత అంశం :
డబ్బు అధికారాన్నీ, అధికారం ప్రతిష్టనీ తీసుకు వస్తుంది.


65. APHRODISIAC
లియోపార్డో  ఆ రాత్రి సెరఫీనతో గడుపుతాడు. అధికారం వున్నను చూసినపుడు వాళ్లతో పడుకోవాలనే కోరిక (aphrodisiac ) పుడుతుంది అంటుంది సెరఫీన. వాళ్లకు మెలుకువ వచే సమయానికి సెరఫీన స్నేహితురాలు లియోపార్డోతొ గడపడానికి సిధ్ధంగా వుంటుంది. తనకు పెళ్ళి అయిందని గుర్తుచేస్తాడు లియోపార్డో. సెలెబ్రెటీలకు అలాంటి నియమాలు చెల్లవు అంటుందా పిల్ల.
సున్నిత అంశం :
మనుషులు డబ్బుతో పడుకోవాలనుకుంటారు.
66. MONICA SHALLOW AND UNWORTHY OF LOVE
డాస్టోవిస్కీ దగ్గర్ నుండి ఇజ్రా పాండ్ వరకు ప్రపంచ ప్రముఖ కవులు, రచయితల గురించి మోనిక అనర్గళంగా మాట్లాడేస్తూ వుంటుంది. సాహిత్యం అనేకాదు  ఏ విషయం మీద అయినా మోనిక పరిజ్ఞానాన్ని చూసి జాక్ ఆశ్చర్య పోతు వుంటాడు. అయితే అది మిడిమిడి జ్ఞానమని జాన్ హెచ్చరిస్తూ వుంటాడు. జాక్ ను ఆకర్షించడానికి మోనిక అలా నటిస్తున్నదని చెపుతాడు.  సంసార పక్షంగా వుండే అమ్మాయిలకన్నా నలుగురితో సంబంధాలున్న అమ్మాయిల మెప్పు పొందడానికి మగవాళ్ళు ఎక్కువగా పోటీ పడుతుంటారు. అలాంటి అమ్మాయిల్ని ఆకర్షించ గలిగితే అది తమ మగతనానికి గుర్తింపుగా భావిస్తారు. జాక్ ను అలాంటి మైకం కమ్ముకుంటుంది. మగవాళ్లను ముగ్గులోనికి ఎలా దింపాలో క్షుణంగా తెలిసిన అమ్మాయి మోనిక.
సున్నిత అంశం :
సంసారపక్షంగా వుండే అమ్మాయిలకన్నా సానిపక్షంగా వుండే అమ్మాయిలంటే అబ్బాయిలకు ఒక క్రేజ్.

67.  RAIN CAVE ROMANCE
ఇప్పుడు జాక్ ఆలోచనల నిండా మోనికా నిండిపోయింది.  జాక్ ను రెయిన్ కేవ్స్ కు తీసుకుపోయింది మోనిక. అక్కడి వాతావరణంలో జాక్ ను మరింతగా ఆకర్షిస్తుంది మోనిక. చస్తే మనిద్దరం కలిసి చద్దాం అని భావోద్వేగంతో అంటుంది.
సున్నిత అంశం :
బూటకపు భావోద్వేగం


68. VERDI PROGRAMME SUCCESS
వేదిక మీద చిన్న బాత్ రూమ్ ఛాంబర్ ఏర్పాటు చేసి,  గియాన్ కార్లో తో వెర్డీ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాడు జెర్రి. అది అద్భుతంగా విజయవంత మవుతుంది.

సున్నిత అంశం :
సాంప్రదాయంలో మార్పు; ఒక విజయం

69. JERRY PAGLIACCI PROPOSAL

గియాన్ కార్లో తో వెర్డీ ప్రోగ్రాం విజయవంతం కావడంతో జెర్రీ ఉత్సాహం పెరుగుతుంది.  గియాన్ కార్లో చిరకాల కోరిక ను నెరవేర్చడానికి పారిస్ లో ఒపేరా (Pagliacci) ప్రదర్శన ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. 
సున్నిత అంశం :
మరో విజయానికి సన్నాహాలు.

70. PARTY FOR THE ELITE OF ROME
ఆంటోనియోను రోమ్ నగర ప్రముఖులకు పరిచయం చేయడానికి అతని  మేనమామలు ఒక పెద్ద పార్టి ఇస్తారు. వాళ్ళందరితో పరిచయాలు పెంచుకో. వ్యాపారానికి పెద్దవాళ్ల సహకారం అవసరం. మీ ఆవిడను కూడా సభ్యతగా వుండమను. సంస్కృతి సభ్యత చాలా ముఖ్యం అని ఆంటోనియోను హెచ్చరిస్తారు వాళ్ళు. అయితే, ఆ రాత్రి విందుకు వచ్చిన రోమ్ నగర ప్రముఖులు అన్నాకూ పాత కష్టమర్లు. వాళ్లంతా అన్నా చుట్టూ చేరి అప్పాయింటుమెంటు నిర్ణయించుకునే పనిలో పడతారు. ఎక్కడికి రావాలో, ఎన్నింటికి రావాలో, ఏ డ్రెస్సు వేసుకుని రావాలో, ఏ రంగు బ్రా వేసుకుని రావాలో అన్నీ మాట్లడుకుంటారు.
సున్నిత అంశం :
పెద్దల పార్టీల్లో వేశ్యలే ప్రధాన ఆకర్షణ.





71. ANNA TAKES HER JOB
అన్నా, ఆంటానియో ఇద్దరూ హొటల్ లాన్ లో నడుస్తున్నారూ. అతిథులందరూ తన కష్టమర్లు కావడాన మిలీగా నటించడం కష్టమైందని చెపుతుంది అన్నా. ఆంటోనియో పరిస్థితి మీద అమె జాలి పడుతుంది. తన భార్య చాలా మంచిదని చెపుతాడు ఆంటోనియో. లూకా పెద్ద హీరోఈ గాబట్టి అభిమానంతో దగ్గరయిందేమో అని ఒక వివరణ ఇస్తాడు. పెళ్లయినపుడు నీ భార్య కన్యయేనా? అని అడుగుతుంది అన్నా. అసలు ఆంటోనియోకే అంత వరకు స్త్రీయోగం దక్కలేదని తెలుస్తుంది. ఆంటోనియోకు సెక్సు పాఠాలు నేర్పుతుంది అన్నా. పైగా దానికి కావలసిన పారితోషికం తనకు ముందే చేరినట్టు చెపుతుంది. ఆ లాన్ లో పొదలమాటున వాళ్ళిద్దరూ సెక్స్ లో పాల్గొంటారు.
సున్నిత అంశం :
అన్నా పక్కా ప్రొఫెషనల్.

72. MONICA ENTRAP JACK
శాలీకి కాలేజీకి వెళ్ళింది. లియోనార్డోకు వేరే పనుంది. ఆ రోజు వంట తను చేస్తానంటుంది మోనికా. కూరగాయలు కొనడానికి మోనికా, జాక్ మార్కట్ కు వెళతారు. మోనికకు వంటరాదనీ, కేవలం జాక్ కు దగ్గర్ కావడానికి మరో అవకాశాన్ని సృష్టిస్తున్నదని అంటాడు జాన్. 
సున్నిత అంశం :
కూరగాయల మార్కెట్లోనూ అబ్బాయిల్ని ఆకర్షించవచ్చు.

73. SUCCUMBS TO MONICA’S CHARMS.
మోనికా, జాక్ కలిసి వంట చేస్తున్నారు. వంత పూర్తికాక ముందే మోనిక వైన్ తాగుతుంది. జాన్ చేప్పినట్టే జాక్ మీద మనసు పడ్డానని చెపుతుంది మోనిక. ఆయితే, బెస్ట్  ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తో ఆమె ఇంట్లోనే సెక్స్ లో పాల్గోవడం తనకు సెంటిమెంటుగా ఇష్టం లేదంటుంది. బయటికి వెళ్ళి కారులో సంభోగం చేసుకుందాం అంటుంది.

సున్నిత అంశం :
సెంటిమెంటు సెక్స్ కోరికను రెట్టింపు చేస్తుంది.

74. SEX IN CAR
వర్షం కురుస్తున్న ఆ సాయంత్రం ఇంటి ముందు కారులో మోనికా, జాక్ సెక్స్ లో పాల్గొంటారు.
సున్నిత అంశం :
మోనిక తన టార్గేట్ నూ పూర్తి చేసింది.

75. LEOPOLDO WITH COUSIN
లియోపోల్డో తన కజిన్ అమ్మాయితో ఒక హొటల్ నుండి బయటికి వస్తున్నాడు. వాళ్లను పాపరజ్జీలు వెంటాడారు. కజిన్ ఒకవైపుకు పారిపోయింది. లియోపోల్డో ఏదో ఊరేగింపులో చేరిపోయాడు.

సున్నిత అంశం :
అతి అజీర్తికి దారితీస్తుంది.

76. DRIVER ENLIGHTENING LEOPOLDO
లియోపోల్డో కారులో ఒక పార్కు లోనికి వచ్చి ఆగాడు. లియోపోల్డోకు అనేక సందేహాలు. అనేక సంధిగ్దాలు. తను సెలబ్రిటి ఎందుకయ్యాడో తెలీదు. చాలా మంది సెలబ్రెటీలకు నిజంగానే ఆ స్థాయి వుండదంటాడు డ్రైవర్. సెలబ్రెటీలంటే పిచ్చి ప్రశ్నలు పిచ్చి సమాధానాలు అని ఒక వివరణ ఇస్తాడు. అమ్మాయిలు గుంపులు గుంపులుగా వచ్చి పైన పడుతున్నారు. భార్యతో ఇబ్బందులురావా? అని అడుగుతాడు. సెలబ్రెటీల భార్యలకు ఇది సాధారణ అనుభవమే అంటాడు డ్రైవర్. అక్కడ కూడా పాపరజ్జీలు వెంటాడడంతో వాళ్ళు పారిపోతారు.

సున్నిత అంశం :
లియోపోల్డోకు కొత్త. డ్రైవర్ ది అనుభవం.

77. ANNA AFTER SEX
హొటల్ లాన్ పొదల చాటు నుండి బయటికి వచ్చి బట్టలు వేసుకుంటున్నారు ఆంటోనియో, అన్నా. తను జీవితంలో ఎన్నడూ చేయనిది చేశాను అంటాడు అంటానియో. తన భార్య మదోన్న వంటిదనీ, ఎప్పుడూ తప్పుచేయదనీ అంటాడు. అతనికి తన భార్యమీద అపారమైన నమ్మకం. తనే తప్పుచేశాననే ఆత్మన్యునతా భావం. ఈ అనుభవాన్ని శిక్షణ ఖాతాలో పడేసుకో అంటుంది అన్నా.
సున్నిత అంశం :
అన్నా హితోపదేశం

78. MILLY& LUCA AT HOTEL ROOM
సినీ హీరో లూకా సాల్టా, మిల్లీ హోటల్ గదిలో ప్రవేశించారు. తనకు పాత పాటలంటే ఇష్టం అంటాడు. ఒక పాట పాడుతాడు. తనకు బాల్య స్మృతులు చాలా బాగుంటాయి అంటాడు. తను సినిమాల్లో హీరో అయినా ఉద్వేగాల్లో మామూలు మనిషి అంటాడు. నువ్వు అందంగా వుంటావని ఇంతకు ముందు ఎవరయినా అన్నారా? అని అడుగుతాడు. డ్రింక్ ఆఫర్ చేస్తాడు. దగ్గరకు లాక్కోని ముద్దు పెట్టుకుంటాడు. మిలీది సంధిగ్ధంలో పడిపోతుంది. భర్తకు అన్యాయం చేస్తున్నాననే భయం ఆమెను సంకోచానికి గురిచేస్తుంది. అతను దగ్గరకు లాక్కొనే ప్రయత్నం చేస్తుంటాడు. బిత్తర్ పోయిన మిల్లీ బాత్ రూమ్ లోనికి వెళ్ళిపోతుంది. గదిలో లూకా సాల్టా చిన్న పిల్లాడిలా డ్యాన్స్ చేస్తాడు.
సున్నిత అంశం :
పొగడ్తలకు ఎవరయినా పడిపోతారు.


79. MONICA ROMANCE IN PARK
మోనికా, జాక్ పార్కులో రొమాన్స్ చేస్తున్నారు. మనం తప్పుచేస్తున్నామేమో అనిపిస్తుంది అంటుంది మోనికా. అయినా శ్యాలీతో అనుబంధం ముగింపుకు వచ్చేసిందని చెప్పావుగా? అంటుంది. వాళ్ళిద్దరూ రోమ్, వెనిస్, నేపుల్స్ లో ఎలా తిరగాలో, ఎక్కడ స్థిరపడాలో వివరాలు ఆలోచిస్తుంటారు. శ్యాలీకి వారం రోజుల్లో పరీక్షలు వున్న కారణంగా ఈ విషయం ఆమెకు అప్పటివరకు  చెప్పకూడదనుకుంటారు. 
సున్నిత అంశం :
నమ్మక ద్రోహానికి  సన్నాహాలు

80. NEW CELEBRETY FOUND
పాపరజ్జీలు మళ్ళీ లియోపోల్డో వెనక పడతారు. అంతలో వాళ్లకు లాండ్రీలో బట్టలు వేయడానికి వెళుతున్న ఒక బస్సు డ్రైవరు కనపడుతాడు. వాళ్లంతా అతని వెనకపడి,  పిచ్చి ప్రశ్నలు వేయడం మొదలెడతారు. పాపరజ్జీల పీడ వదిలినందుకు సంతోషంలో లియోపోల్డో ఇంటికి పరుగు తీస్తాడు,
సున్నిత అంశం :
పాత ఒక రోత,కొత్త ఒక వింత.

81. LIOPOLDO BACK TO HOME
లియోపోల్డో ఇంటికి చేరుకున్నాడు. ఇక తాము ప్రశాంతంగా బతకవచ్చని పెళ్ళాం, పిల్లలకు చెపుతాడు.
సున్నిత అంశం :
ఆట విడుపు కాస్సేపు బాగుంటుంది.

82. DREAM OFFER TO MONICA
శ్యాలీ, జాక్, మోనిక భోజనానికి గార్డెన్ రెస్టారెంటుకు  వెళ్ళారు. తను పరీక్షలు బాగా రాశాను అంటుంది శ్యాలీ. అమె పక్కకు వెళ్లగానే  మోనికా, జాక్ తమ ప్లాన్ ను రూపొందిస్తారు. రాత్రి శ్యాలీని డిన్నర్ కు తీసుకెళ్ళి విషయం చెప్పేస్తాను అంటాడు జాక్. వాళ్లిద్దరూ ఒక సైల్ బోటు అద్దెకు తీసుకుని ఏఏ దీవుల్లో తిరగాలో ప్లాన్ చేసుకుంటుంటారు. అంతలో మోనికాకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. సిగ్నల్ కోసం మోనికా దూరంగా పోతుంది.    ఇంతలో జాన్ వచ్చి జాక్ కు హితబోధ చేస్తాడు.  మోనిక కన్నా శ్యాలి చాలా మంచి  (sensible) అమ్మాయి అని గుర్తు చేస్తాడు. జాక్ వినడు. మోనికతో జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటాడు. అంతలో మోనిక వస్తుంది. తనకు ఒక భారీ సినిమా ఆఫర్ వచ్చిందని చెపుతుంది, మాక్స్  ట్రొమ్మెల్, జస్టిన్ బ్రిల్, రికార్డో రెమిరెజ్ వంటి వాళ్లు ఆ చిత్రానికి హీరో, దర్శకులు అని చెపుతుంది. వాళ్లతో నటించాలనేది తనకు జీవితకాల కల అంటుంది. నేనింక ఆగలేను వెంటనే  వెళ్ళిపోవాలి. నా పెంపుడు కుక్కను తెచ్చుకోవాలి అంటుంది మోనిక. అప్పటికి కొన్ని నిముషాల ముందు జాక్ కన్న కలలన్నీ కరిగిపోతాయి.
సున్నిత అంశం :
కనువిప్పు.

83. THE THIEF EPISODE

మిల్లి అద్దం ముందు నిలబడి ఆలోచిస్తోంది. లూకా సాల్టాతో మంచం పంచుకుని ఒక తప్పు జరిగిపోయింది అనుకోవాలా? అతనితో పడుకునే అవకాశాన్ని వదులుకున్నందుకు జీవితకాలం బాధపడాలా? అనేది ఆమె సందేహం.  మిల్లీ ఊగిసలాటలో వుండగా, ఒక దొంగ చేతిలో రివాల్వర్  పట్టుకుని బాత్ రూమ్ లోనికి  ప్రవేశించాడు. కదిలితే చంపేస్తానన్నాడు. మిలీ తలకు రివాల్వర్ గురిపెట్టి బెడ్ రూమ్ లోనికి తీసుకువస్తాడు. దొంగను చూసి లూకా సాల్టా బిత్తరపోతాడు. లూకా సాల్టాను భయపెట్టి అతని పర్సును, వాచీనీ లాక్కుంటాడు దొంగ. ఇంతలో హొటల్ సెక్యూరిటీ చీఫ్ వచ్చి తలుపు బాదుతాడు. :లూకా నువ్వు లోపలున్నావని నాకు తెలుసు అని అరుస్తూ వుంటుంది లూకా భార్య. భార్య గొంతు వినగానే లూకా భయపడిపోతాడు. నా భార్య వచ్చేసింది. నా కథ ముగిసింది అని కంగారు పడిపోతాడు లూకా. మీరు విడిపోయారు అన్నావుగా అని మిల్లీ గొడవ పెట్టుకుంటుంది. విడిపోతున్నాం గానీ విడిపోలేదు అంటాడు హీరో. అప్పుడు దొంగ ఒక చిట్కా చెపుతాడు. లూకాను బాత్ రూం లోనికి వెళ్ళి దాక్కో మంటాడు.  తాను చొక్కా తీసి మిలీతో పాటూ మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకుంటాడు. హోటలు మేనేజరు, ఇద్దరు లాయర్లు,  ఇంకో ఇద్దరు బౌన్సర్లతో లూకా భార్య లోపలికి వస్తుంది. మంచం మీద దొంగ, మిల్లీ ని చూసి వాళ్ళు ఖంగుతింటారు. వచ్చిన వాళ్ళను  నాటకీయంగా తిట్టి పంపించివేస్తాడు దొంగ. వాళ్ళు వెళ్ళిపోయాక లూకా బాత్ రూమ్ నుండి బయటికి వచ్చి పెద్ద గండం నుండి కాపాడినందుకు కృతజ్ఞతగా బ్రేస్ లెట్, ఉంగరం తీసి దొంగకు ఇచ్చి, అమ్మాయిని కూడా నువ్వే వాడుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. లూకా  వెళ్ళిపోయాక ఒక హొటల్ రూములో, ఒకే మంచం మీద ఒంటరిగా  వున్న అమ్మాయి అబ్బాయి ఏం చేస్తారో ఆ పని ఆ దొంగ మిలీతో చేస్తాడు.
సున్నిత అంశం :
అవకాశం మనుషుల్ని ఆడిస్తుంది.


84. JACK REASSESSMENT
మోనిక ఇంకెప్పుడూ తనతో ఫోన్ లో కూడా  మాట్లాడక పోవచ్చు అంటాడూ జాక్. దానిదేముందీ ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్స్ తో చేసే డేటింగుల గురించీ గాసిప్ కాలమ్స్ లో చదువుతూ వుండవచ్చు అని ఎద్దేవ చేస్తాడు జాన్. వయసుతో పాటూ జ్ఞానం వస్తుంది అంటాడు జాక్. వయసుతో పాటూ అలసట వస్తుంది అంటాడు జాన్. వాళ్ళిద్దరూ తొలిసారి కలుసుకున్న చోటికి వచ్చి విడిపొయి, తలో దిక్కుకు పోతారు.
సున్నిత అంశం :
ఒక అనుభవం ఒక జ్ఞానంతో ముగుస్తుంది.

85. LEOPOLDO AGAIN UNNOTICED
లియోపోల్డో పిసానిల్లో భార్య సోఫియాతో పాటూ ఓ సాయంత్రం రోడ్డు మీద నడుస్తున్నాడు. ఎవ్వరూ వాళను పట్టించుకోరు. జీవితం ఎంతప్రశాంతంగా వుంది అంటుంది భార్య.  సాయంత్రం మూవీ ప్రివ్యూకు వెళదాం అన్నాడు లియోపోల్డో. కానీ, తమకు ఆహ్వానం రాలేదంటుంది భార్య. క్రమంగా తనకు గుర్తింపు తగ్గిపోతున్నదని తెలిసి లియోపోల్డో తీవ్ర సంతృప్తికి గురవుతాడు. దానితో అతనికి మతి చలిస్తుంది. రోడ్డు మీద వేళ్ళె వాళ్లను ఆపి తాను లియోపోల్డో పిసానిల్లో నగర ప్రముఖుడ్ని అని పరిచేయం చేసుకోవడం మొదలెడతాడు. తాను బ్రెడ్ ఏలా తింటాడో, గెడ్డం ఎలా గీసుకుంటాడో, చివరకు బాక్సర్ ఏ రంగుది వేసుకుంటాడో ప్యాంటు విప్పి చూపిస్తాడు. భార్య వారిస్తున్నా వినడు. చివరకు ఒకమ్మాయి అతన్ని గుర్తు పడుతుంది. కావాలా అని అడిగి మరీ ఆమెకు ఆటోగ్రాఫ్ ఇస్తాడు లియోపోల్డో. అక్కడ ఒక రోడ్ సైడ్ రెస్టారెంట్ లో లియోపోల్డో కు ఒకనాటి డ్రైవర్ రోబర్టో కనిపిస్తాడు. అతనోక జీవిత సత్యాన్ని చెప్పుతాడు. జీవితమేలో శోక వుంటుంది. పేదలు, సమాజంలో గుర్తింపులేనివాళ్లకూ జీవితంలో శోకం వుంటుంది. ధనంతులు, సమాజంలో గుర్తింవున్న వున్నవాళ్లకూ శోకం వుంటుంది,. రెండింటిలో రెండో శోకమే ఆశ్వాదించడానికి బాగుంటుంది అంటాడు. జీవిత పరమార్ధాన్ని తెలుసుకున్న లియోపోల్డో భార్యతోపాటూ ఇంటిదారి పడతాడు.
సున్నిత అంశం :
పేదోళ్ల బాధ కష్టంగానూ, డబ్బున్నోళ్ల బాధ సుఖంగానూ వుంటుంది.

86. MILLY RETURNED

మిల్లీ  భర్త విడిది చేసిన  హొటల్ గదికి చేరుకుని భర్త కోసం ఎదురుచూస్తూ వుంటుంది. ఆంటోనియో రూమ్ కు తిరిగి వస్తాడు. రోమ్ నగరంలో తాను దారి తప్పిపోయినట్టు చెపుతుంది మిల్లీ. భేషజాలలో కూడిన తన అత్త, నగర ప్రముఖుల మధ్య తాము బతకలేమని అంటాడు ఆంటోనియో.  ఇద్దరూ తమ ఊరికి తిరిగి వెళ్ళి పాత ఉద్యోగంతో పాత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటారు. వెళ్లడానికి ముందు భార్యను దగ్గరకు లాక్కొని ఆక్రమణ చేస్తా నంటూ మంచం మీదికి లాక్కుంటాడు ఆంటోనియో. 
సున్నిత అంశం :
స్వంత గూటికి


87. PAGLIACCI SHOW

గియాన్ కార్లో ను బాత్ రూమ్ ఛాంబర్ లో వుంచే, పాగ్లియాచ్చి సాంప్రదాయ ఒపేరా ప్రదర్శన ఏర్పాటు చేస్తాడు జెర్రీ. గియాన్ కార్లో గాత్ర విన్యాసం ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. 
సున్నిత అంశం :
చేరుకున్న గమ్యం.

88. MEDIA REVIEWS
గియాన్ కార్లో పాగ్లియాచ్చి ప్రదర్శనను పత్రికలు మెచ్చుకుంటాయి.  అలనాటి సాంప్రదాయ గాత్రాన్ని మళ్ళీ వినిపించినందుకు గియాన్ కార్లోను పొగడ్తలతో ముంచేస్తాయి. పత్రికల్లో వచ్చిన సమీక్షల్ని కొడుకు చదివి వినిపిస్తుంటే గియాన్ కార్లో గొప్పగా ఆస్వాదిఉస్తాడు. తన చిరకాల కోరిక నెరవేరిపోయింది అంటాడు. ఇక తాను తన పని చేసుకుంటూ ప్రశాంతంగా బతుకుతానంటాడు. సాంప్రదాయ పాగ్లియాచ్చి ప్రదర్శనలో బాత్ రూమ్ ఛాంబర్ పెట్టినందుకు దర్శకుడు జెర్రీని పత్రికలు తీవ్రంగా విమర్శిస్తాయి. ఏకంగా అతని తల నరికేయాలన్నంత ఆగ్రహాన్ని ప్రదర్శిస్తాయి. ఆ విషయాన్ని తన తండ్రికి చెప్పవద్దని మికెల్యాంజిలోను కోరుతుంది హేలీ.  ఇటాలియన్ భాష రాకపోవడం వల్ల  ఆ విషయం జెర్రీకి  తెలీదు.
సున్నిత అంశం :
విజయాన్ని ఆస్వాదిస్తున్నపుడు లోపాల్ని పట్టించుకోకూడదు.

89 . SPANISH STEPS           
మీడియాలో సమీక్షలు బాగా వచ్చినందుకు జెర్రి కూడా సంతోషిస్తాడు. తనను         Imbecile అన్నారని భార్యతో అంటాడు. ఆ పదానికి అర్ధం  ఏమిటని అడుగుతాడు.  దానికి ఇంగ్లీషులో beheaded అని అర్ధం.  కానీ ఫిల్లీస్ మాత్రం  ahead of your time అని కొత్త అర్ధం చెపుతుంది. ఆ మాటవిని జెర్రీ కూడా చాలా అనందపడతాడు. Imbecile కు భార్య కావడం నీ అదృష్టం అంటాడు జెర్రీ. అందరూ నవ్వుతారు. రోమ్ నగరం మధ్యలో వున్న ఫౌంటేన్ ముందు పెళ్ళి చేసుకోవాలని వుందని చెపుతుంది హేలీ. ఆ రాత్రంతా హేలీ, మికెల్యాంజిలో ఆ ఫౌంటేన్ ను చూస్తూ గడిపేస్తారు. 
సున్నిత అంశం :
పరిష్కారం
90. LAST NOTE
ఆ రాత్రి అందరూ స్పానిష్ స్టెప్స్ దగ్గరికి చేరుతుంటారు. ఒక ఇంటి తలుపు  తెరుచుకుని వ్యాఖ్యాత ముందుకు వస్తాడు. రోమ్ గురించి పోలీసులు, ఇతరులకన్నా నాకు బాగా తెలుసు. రోమ్ నగరం గురించి యువకులు, విద్యార్ధులు, ప్రేమికులు చెప్పాలి.  వేలవేల కథలు వుంటాయి వాళ్ల దగ్గర. ఈసారి మీరు వచ్చినపుడు అవి చెపుతాను అంటాడు.
సున్నిత అంశం :
ఒక ముగింపు.

91.  END TITLES

THE END

No comments:

Post a Comment