Wednesday, 12 January 2022

మనసు దోచిన కోర్ట్ రూమ్ డ్రామాస్

 మనసుదోచిన కోర్ట్ రూమ్ డ్రామాస్

Dec 27 2021 @ 13:37PM


కోర్టు రూమ్ డ్రామాస్ కు ఎప్పుడూ మంచి రీచ్ ఉంటుంది.  కథాకథనాలు ఆసక్తికరమైన రీతిలో ఉండి.. చక్కటి ఎమోషన్స్ కూ చోటు కల్పిస్తే అలాంటి సినిమాలు ఎప్పుడూ  ప్రేక్షకాదరణను పొందుతూనే ఉంటాయి. 2021 లో ఆ తరహాలోనే పలు చిత్రాలు విడుదలయ్యాయి. చేయని నేరానికి జైలుకు వెళ్ళడం.. హీరో/హీరోయిన్ అయిన లాయర్ అలాంటి వారి తరపున అండగా నిలబడి బల్ల గుద్ది మరీ వాదించడం.. చివరికి ఆ కేసును ఉత్కంఠను గొలిపే తీర్పుతో గెలచుకోవడం.. ఈ కాన్సెప్ట్స్ లోని కామన్ పాయింట్. మరి ఈ ఏడాది అలాంటి మనసుదోచిన కోర్ట్ రూమ్ డ్రామాస్ ఏమేం ఉన్నాయో చూసేద్దాం...

వకీల్ సాబ్ పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత కమ్ బ్యాక్ ఇచ్చిన ప్రత్యేకమైన చిత్రం ‘వకీల్‌సాబ్’ . పింక్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రీమేక్ గా వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ‘పింక్’ మూవీ కాన్సెప్ట్ ను అజిత్ తమిళ చిత్రం ‘నేర్కొండ పార్వై’ ఫార్మేట్ లో మలిచి పవర్ స్టార్ అభిమానులకు మంచి ఫీస్ట్ ఇచ్చిన చిత్రమిది. వివిధ ప్రాంతాలనుంచి హైద్రాబాద్ వచ్చి ఒక హాస్టల్ లో ఉంటున్న ముగ్గురు అమ్మాయిలు.. వారి స్నేహితులైన కొందరు అబ్బాయిల వల్ల ఒక గొడవలో ఇరుక్కుంటారు. దాని వల్ల ఆ అమ్మాయిల జీవితాలు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడుతుంది. ఆ గొడవ కోర్ట్ కేసు వరకూ వెళుతుంది. ఆ పరిస్థితుల్లో ఆ అమ్మాయిల తరపున సత్యదేవ్ అనే ఒక వకీల్ నిలబడి.. వారికి న్యాయం చేయడమే ఈ సినిమా కథాంశం. బలమైన కోర్ట్ సన్నివేశాలే ఈ సినిమాను నిలబెట్టాయి. ముఖ్యంగా ప్రకాశ్ రాజ్, పవన్ మధ్య వచ్చే సీన్స్ విజిల్స్ వేయించాయి. పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకే హైలైట్. 

జైభీమ్ తమిళ హీరో సూర్య లాయర్ గా నటించిన చిత్రం ‘జైభీమ్’. చంద్రు అనే ఒక లాయర్ నిజజీవిత కథగా ఈ సినిమా తెరకెక్కింది. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం ఈ సినిమా విడుదలైంది. చేయని నేరానికి జైలు పాలైన ముగ్గురు గిరిజనులు అదృశ్యమవుతారు. అందులో ఒకరి భార్య తనకు న్యాయం చేయమని కోర్ట్ మెట్లు ఎక్కుతుంది. ఆ పరిస్థితుల్లో చంద్రు అనే ఒక లాయర్ ఈ కేసు ను వాదించి ఆమెకు న్యాయం చేయడమే ఈ సినిమా కథాంశం. ఇందులోని సహజమైన సన్నివేశాలు, ఎమోషన్స్ సినిమాను నిలబెట్టాయి. విమర్శకుల ప్రసంశలు సైతం అందుకున్న ఈ సినిమా వరల్డ్ నెం. 1 మూవీగా నిలిచింది. చంద్రుగా సూర్య నటనకి మంచి ప్రశంసలు దక్కాయి. ఆసక్తికరమైన కోర్ట్ రూమ్ సన్నివేశాలు, గుండెను పిండేసే ఎమోషన్స్ ఈ సినిమాను నిలబెట్టాయి. 

నాందిఅల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రం ‘నాంది’. కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఒక హత్యకేసులో ప్రధాన నిందితుడిగా కోర్టు మెట్లు ఎక్కిన ఒక యువకుడి తరపున ఒక లాయర్ నిలబడి.. అతడి నిర్ధోషిత్వాన్ని నిరూపించడమే ఈ సినిమా కథాంశం. ఈ పాత్ర కోసం అల్లరి నరేశ్ నగ్నంగా కూడా నటించాడు. సహజమైన నటనతో.. ఆకట్టుకున్నాడు నరేశ్, లాయర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఈ సినిమా అల్లరి నరేశ్ కు నటుడిగా పునర్జన్మనిచ్చిందని చెప్పొచ్చు. ఇందులోని కోర్ట్ సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. అలాగే.. చక్కటి ఎమోషన్స్ కూడా పండడంతో సినిమాకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. 

తిమ్మరుసు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ లాయర్ గా నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్ తిమ్మరుసు. ఆపరేషన్ వాలి ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ సినిమాకి శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. కన్నడ చిత్రం ‘బీర్బల్ ట్రయాలజీ కేస్ 1: ఫైండింగ్ వజ్రముని’ చిత్రానికిది అఫీషియల్ రీమేక్.  ఒక మర్డర్ ను స్వయంగా చూసిన ఒక యువకుడు అదే మర్డర్ కేసులో నిందితుడిగా ఇరికించబడతాడు. ఆ పరిస్థితుల్లో అతడి తరపున రామచంద్ర అనే లాయర్ కేసు వాదిస్తాడు. ఆ క్రమంలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చివరికి ఆ కేసు నుంచి అమాయకుడైన ఆ యువకుడు ఎలా బైటపడతాడు? అన్నదే మిగతా కథ. ఆసక్తికరమైన కథాకథనాలతో, ఉత్కంఠను గొలిపే కోర్ట్ రూమ్ సన్నివేశాలతో ఈ సినిమా ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఈ సినిమాకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయి.. సినిమాను సూపర్ హిట్ చేశారు. 

చెక్నితిన్ హీరోగా.. ఏలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్ ‘చెక్’. చేయని నేరానికి జైలు పాలైన ఒక యువకుడు చదరంగంలో గ్రాండ్ మాస్టర్ గా ఎదిగి తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడు అన్నదే ఈ సినిమా కథాంశం. ఉగ్రదాడిలో 40 మంది మరణానికి కారణమయ్యాడనే కారణంగా హీరోకి ఉరిశిక్ష వేస్తారు. అలా జైలుకు వెళ్ళిన హీరో అక్కడ ఒకరి సహాయంతో చెస్ నేర్చుకొని ఛాంపియన్ అయి..  రాష్ట్రపతిని క్షమాభిక్ష అర్ధిస్తాడు.  చివరికి అతడు జైలు నుంచి విడుదలయ్యాడా లేదా అన్నదే మిగతా కథ. కోర్ట్ రూమ్ సన్నివేశాలు, చెస్ ముడిపడి ఉన్న సీన్స్ ఆసక్తిని కలిగిస్తాయి. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇందులో హీరో తరపున వాదించే లాయర్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. -రామకృష్ణ కుమార్ 


Monday, 10 January 2022

The 50 Greatest Jewish Movies

 The 50 Greatest Jewish Movies

From Wikipedia, the free encyclopedia

Jump to navigationJump to search

The 50 Greatest Jewish Movies: A Critic's Ranking of the Very Best was a 1998 book published by Kathryn Bernheimer. Bernheimer ranked the "top 50" films dealing with Jewish topics.[1]



Contents

1 List

2 References

3 Further reading

4 External links

List

Rank Title Year Rating Director

1 The Chosen 1981 PG Jeremy Paul Kagan

2 Schindler's List 1993 R Steven Spielberg

3 Shoah 1985 NR Claude Lanzmann

4 The Jazz Singer 1927 NR Alan Crosland

5 Annie Hall 1977 PG Woody Allen

6 Funny Girl 1968 G William Wyler

7 Gentleman's Agreement 1947 NR Elia Kazan

8 Exodus 1960 NR Otto Preminger

9 Ben-Hur (a Christian movie) 1959 NR William Wyler

10 The Ten Commandments 1956 G Cecil B. DeMille

11 Crossing Delancey 1988 PG Joan Micklin Silver

12 The Golem 1920 NR Paul Wegener and Carl Boese

13 Au revoir, les enfants 1987 PG Louis Malle

14 Almonds and Raisins: A History of the Yiddish Cinema 1985[2][3] NR Russ Karel[4][5]

15 Enemies, a Love Story 1989 R Paul Mazursky

16 The Great Dictator 1940 NR Charlie Chaplin

17 The Apprenticeship of Duddy Kravitz 1974 PG Ted Kotcheff

18 Blazing Saddles 1974 R Mel Brooks

19 Chariots of Fire 1981 PG Hugh Hudson

20 Body and Soul 1947 NR Robert Rossen

21 The Pawnbroker 1965 NR Sidney Lumet

22 Goodbye, Columbus 1969 PG Larry Peerce

23 Bugsy 1991 R Barry Levinson

24 Cabaret 1972 PG Bob Fosse

25 Crimes and Misdemeanors 1989 PG-13 Woody Allen

26 The Last Angry Man 1959 NR Daniel Mann

27 The Outside Chance of Maximilian Glick 1988 G Allan Goldstein

28 Job's Revolt 1983 NR Imre Gyöngyössy and Barna Kabay

29 Homicide 1991 R David Mamet

30 Madame Rosa 1977 PG Moshé Mizrahi

31 Driving Miss Daisy 1989 PG Bruce Beresford

32 Reversal of Fortune 1990 R Barbet Schroeder

33 Europa Europa 1991 R Agnieszka Holland (Judeo-Catholic)

34 The Big Fix 1978 PG Jeremy Kagan

35 Broadway Danny Rose 1984 PG Woody Allen

36 Julia 1977 PG Fred Zinnemann

37 Marathon Man 1976 R John Schlesinger

38 A Majority of One 1962 NR Mervyn LeRoy

39 Oliver! 1968 G Carol Reed

40 Down and Out in Beverly Hills 1986 R Paul Mazursky

41 Holocaust 1978 NR Marvin Chomsky

42 Dirty Dancing 1987 PG-13 Emile Ardolino

43 The Front 1976 PG Martin Ritt

44 Biloxi Blues 1988 PG-13 Mike Nichols

45 The Diary of Anne Frank 1959 NR George Stevens

46 Shine 1996 PG-13 Scott Hicks

47 Daniel 1983 R Sidney Lumet

48 Yentl 1983 PG Barbra Streisand

49 The Young Lions 1958 NR Edward Dmytryk

50 Marjorie Morningstar 1958 NR Irving Rapper





Critic's Ranking of the Very Best'

Author: 

Kathryn Bernheimer

Reviewer: 

Solomon Davidoff


Kathryn Bernheimer. The 50 Greatest Jewish Movies: A Critic's Ranking of the Very Best. Secaucus, N.J.: Carol Publishing Group, 1998. xi + 212 pp. $21.95 (paper), ISBN 978-1-55972-457-9.


Reviewed by Solomon Davidoff (Bowling Green State University)

Published on H-Film (April, 1999)


Eight Fingers


I have often wondered, if we had only eight fingers instead of ten, would we be producing lists of the Thirty-Two Greatest (fill in subject here) of all time? I ask the question, because while Bernheimer attempts to categorize Jewish oriented film into the fifty greatest of all time, she notes the difficulty that the restriction places upon her, and how she has to sneak in other worthy titles among her reviews, mentioning The Frisco Kid when discussing Blazing Saddles for instance.


Bernheimer provides commentary for each of the fifty films that begins with the standard information (title, studio, year of release, primary cast, director, length and rating) and a description of the entire photoplay, but goes into both positive and negative commentary. This is unlike some motion picture review books, which not only offer only positive commentary, but do not discuss the entire plot of the film, including the conclusion. While as a viewer I do not wish to be aware of a movie's conclusion before seeing it, I do want that information when reading full commentary of a production and its historical and cultural importance.


"For the purposes of this book," says Bernheimer, "I define (a Jewish movie) as a film that examines an aspect of the Jewish experience and features at least one clearly defined Jewish central character" (p. ix). This definition--an excellent starting point--explains the presence and absence of a variety of titles of import. Previous similar lists have focused on seminal historical events of import to the Jewish community, such as the Holocaust, but Bernheimer does not limit herself (beyond this definition) in any way. A key aspect of this, is that she includes pictures by both Jewish directors (such as Sidney Lumet, Woody Allen, Otto Preminger and Steven Spielberg), plus films by non-Jews (such as Edward Dmytryk, Hugh Hudson and Norman Jewison). While commentary has been made that only someone with intimate knowledge of a community can accurately direct or play the role of a member, this explanation being used to explain the absence of some texts in commentary, I feel that Rod Steiger's performance in both The Chosen and The Pawnbroker belies this comment. (I also agree with Bernheimer, at least in that The Chosen is one of the most important Jewish films of all time).


Bernheimer's list does not specify titles by category, but instead lists films by importance, acknowledging that she has biases when deciding. A nice feature she includes is to begin at the top of the list with her number one selection, The Chosen, following on through to her fiftieth, Marjorie Morningstar, which implies to me the importance of all the films on her list, rather than making reading the commentary an anticipatory exercise, focusing more on what is to come, rather than what is being read. Bernheimer's list is a top fifty, focusing on all film genres and styles. Also of note is that telefilms, such as Holocaust and Shoah, and documentaries, like Almonds and Raisins: A History of the Yiddish Cinema, are included in her listing. Many such lists will consider only films that were created for the silver screen, or will ignore documentaries. If there is a fault in Bernheimer's compilation, it is that she refers to a list of more than 250 films with Jewish characters and subjects that are available on video, but does not supply that list as an appendix. It would have been informative, and interesting, to note the films that made up her starting point. The survey ranges from the 1920 silent production of The Golem, to Shine from 1996, and covers all genres and filming techniques (except animation), including spectacles (Ben-Hur), musicals (Oliver!), gangster films (Bugsy), war stories (Europa, Europa) and comedies (Goodbye Columbus).


When considering the importance of this film survey, I am reminded of that famous stage production by Bob Booker and George Foster, You Don't Have To Be Jewish. Bernheimer's book offers a look into the representation of a widely misunderstood culture, in a clear and concise style that gives the subject the attention it deserves.


This review is copyrighted by Film & History: An Interdisciplinary Journal of Film and Television Studies and the Historians Film Committee, http://www.h-net.msu.edu/~filmhis/. It may be reproduced electronically for educational or scholarly use. The Film & History reserves print rights and permissions. (Contact: P.C.Rollins at the following electronic address: Rollinspc@aol.com).


Printable Version: http://www.h-net.org/reviews/showpdf.php?id=3038


Citation: Solomon Davidoff. Review of Bernheimer, Kathryn, The 50 Greatest Jewish Movies: A Critic's Ranking of the Very Best. H-Film, H-Net Reviews. April, 1999.

URL: http://www.h-net.org/reviews/showrev.php?id=3038


Copyright © 1999 by H-Net, all rights reserved. H-Net permits the redistribution and reprinting of this work for nonprofit, educational purposes, with full and accurate attribution to the author, web location, date of publication, originating list, and H-Net: Humanities & Social Sciences Online. For any other proposed use, contact the Reviews editorial staff at hbooks@mail.h-net.msu.edu.